Sourav Ganguly, Mithun
Rajya Sabha seat : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజ్యసభ సీటు కోసం బీజేపీ ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తుల పేర్లను పరిశీలిస్తోంది.త్వరలో ఎంపిక జరగనున్న ఒక్క రాజ్యసభ సీటు రేసులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ,ప్రముఖ బాలీవుడ్ నటుడు, మెగాస్టార్ మిథున్ చక్రవర్తి పేర్లను పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీవర్గాల సమాచారం. రాజ్యసభ సీటు కోసం అభ్యర్థుల జాబితాను బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి వేర్వేరు జాబితాలను బీజేపీ అధిష్ఠాన వర్గానికి సమర్పించారు. జులై 10వతేదీన పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మజుందార్ ప్రతిపాదించిన జాబితాలో రాజ్యసభ మాజీ సభ్యులు రూపా గంగూలీ, స్వపన్ దాస్‌గుప్తా, బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య, రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్ త్రివేది, అనంత్ మహరాజ్ ఉన్నారు. బీజేపీ నాయకత్వం ఇప్పటికే సౌరవ్ గంగూలీకి ఎంపీ నామినేషన్‌ను ప్రతిపాదించింది. అయినప్పటికీ అతని నుంచి తక్షణ స్పందన లేదు. ప్రస్తుత రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనున్నందున జూలై 24న ఎన్నికల ప్రక్రియ జరగనుంది.
పదవీకాలం ముగుస్తున్న వారిలో డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందుశేఖ వంటి ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ప్రదీప్ భట్టాచార్య కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు. గుజరాత్‌లోని ఆరు స్థానాల్లో మూడింటికి, గోవా, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభలో పోటీ చేయనున్న 10 స్థానాల్లో ప్రముఖ వ్యక్తుల్లో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఉన్నారు. వీరి పదవీకాలం ఆగస్టు 18వతేదీతో ముగియనుంది. లుజిన్ హో జోక్విమ్ ఫెల్లెరియో తన పదవీకాలం 2026లో ముగియడానికి ముందే ఏప్రిల్‌లో రాజీనామా చేయడంతో, వివిధ పార్టీల నాయకులు ఇప్పటికే గోవాలో ఎంపీ పదవి కోసం పోటీ పడుతున్నారు.
Eatala Rajender : ట్విట్టర్ లో ఈటల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
మరోవైపు గుజరాత్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్‌ను భారతీయ జనతా పార్టీ టిక్కెట్‌పై మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభలో మొత్తం 294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఒక్కో సీటును దక్కించుకోవడానికి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 34 మంది ఎమ్మెల్యేల ఓట్లతో బీజేపీ ఒక్క సీటు గెలుచుకుంటుందని అంచనా. కొంతమంది టీఎంసీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం వేర్వేరు కేసుల్లో జైలులో ఉన్నారు.దీంతో టీఎంసీ ఓట్ల లెక్కింపునకు ఆటంకం కలిగించవచ్చు.