BJP nationwide protests: నేడు దేశ వ్యాప్తంగా బీజేపీ నిరనస ప్రదర్శనలు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ‘‘దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు తెలుపుతాం. పాకిస్థాన్ తో పాటు పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మలను బీజేపీ కార్యకర్తలు తగులబెడతారు. పాక్ విదేశాంగ మంత్రి సిగ్గులేకుండా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

BJP nationwide protests: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ‘గుజరాత్ కసాయి’ అని పేర్కొంటూ పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావర్ భుట్టో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసన ప్రదర్శనలు చేపట్టనుంది. ‘‘దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో నిరసనలు తెలుపుతాం. పాకిస్థాన్ తో పాటు పాక్ విదేశాంగ మంత్రి దిష్టిబొమ్మలను బీజేపీ కార్యకర్తలు తగులబెడతారు. పాక్ విదేశాంగ మంత్రి సిగ్గులేకుండా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతున్న తీరును, ఆ దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, పాక్ ఆర్మీలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి భారత ప్రధానిపై ఇటువంటి వ్యాఖ్యలు చేశారని భారత విదేశాంగ శాఖ చెప్పింది. ఓ వైపు ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచం మొత్తం మంచి పేరును తెచ్చుకుంటోందని, భారత విదేశీ పాలసీపై ప్రశంసలు కురుస్తున్నాయని పేర్కొంది.

మరోవైపు పాకిస్థాన్ మాత్రం తన తీరుతో విమర్శల పాలవుతోందని చెప్పింది. భారత ప్రధాని మోదీపై విమర్శలు చేసేంత స్థాయి బిలావర్ భుట్టోకు ఉందా? అని ప్రశ్నించింది. నిన్న కూడా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున న్యూఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయం ముందు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. బిలావర్ భుట్టో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Avatar 2: అవతార్-2 సినిమా కాదంటోన్న వర్మ.. అది నేరమట!

ట్రెండింగ్ వార్తలు