Dalit man assaulted: గుడిలోకి వచ్చాడని దళిత యువకుడిపై మండుతున్న కర్రలతో దాడి

మానవ సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా దళితులు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అవమానాలు, దాడులకు గురవుతూనే ఉన్నారు. గుడిలో దేవుడికి దండం పెట్టుకునే భాగ్యాన్ని కూడా దళితులకు కల్పించడం లేదు అగ్ర వర్ణాలు. ఓ దళితుడు గుడిలోకి ప్రవేశించడంతో అతడిపై మండుతున్న కర్రలతో దాడి చేశారు కొందరు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో చోటుచేసుకుంది.

Dalit man assaulted: మానవ సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా దళితులు పలు ప్రాంతాల్లో ఇప్పటికీ అవమానాలు, దాడులకు గురవుతూనే ఉన్నారు. గుడిలో దేవుడికి దండం పెట్టుకునే భాగ్యాన్ని కూడా దళితులకు కల్పించడం లేదు అగ్ర వర్ణాలు. ఓ దళితుడు గుడిలోకి ప్రవేశించడంతో అతడిపై మండుతున్న కర్రలతో దాడి చేశారు కొందరు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో చోటుచేసుకుంది.

మోరీ ప్రాంతంలోని సర్లా గ్రామంలోని మందిరంలో దేవుడిని దర్శించుకోవడానికి 22 ఏళ్ల ఆయుష్ అనే యువకుడు వెళ్లాడు. అయితే, తాను గుడిలోకి ప్రవేశించగానే కొందరు అగ్ర వర్ణాల వారు తనను కట్టేసి, మండుతున్న కర్రలతో కొట్టారని ఆయుష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆయుష్ స్థానిక ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లగా, అతడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం పెద్దాసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు.

తాను దళితుడిని కావడంతో అగ్ర వర్ణాల వారు ఆగ్రహం తెచ్చుకుని, గుడిలోకి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నిస్తూ దాడి చేశారని ఆయుష్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడు చేసిన ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ఐదుగురు గ్రామస్థులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Sharad Yadav Death: జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూత.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం..

ట్రెండింగ్ వార్తలు