Protest against Pathaan: హీరో షారుఖ్ ఖాన్ దిష్టిబొమ్మను తగులబెట్టిన నిరసనకారులు

పఠాన్ సినిమాపై నిషేధం విధించాలంటూ వీర్ శివాజీ గ్రూప్ సభ్యులు నినాదాలు చేశారు. ‘పఠాన్’లో బేషరం రంగ్ పాట సాహిత్యం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. కాగా, ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది.

Protest against Pathaan

Protest against Pathaan: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పలువురు నిరసనకారులు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. షారుఖ్ కొత్త సినిమా ‘పఠాన్’లో బేషరం రంగ్ పాట తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో షారూఖ్, దీపిక దుస్తులు, పాట సాహిత్యం వంటివి వివాదాస్పదమయ్యాయి.

దీనిపై ఇప్పటికే మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, పాటలోని అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలని, హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కూడా వేరేవి ఉండాలని అన్నారు. ఇండోర్‌లో వీర్ శివాజీ గ్రూప్ సభ్యులు ఇదే సినిమాపై నిరసన తెలిపారు.

షారుఖ్ దిష్టిబొమ్మలను తగులబెట్టి, ఈ సినిమాపై నిషేధం విధించాలంటూ నినాదాలు చేశారు. ‘పఠాన్’లో బేషరం రంగ్ పాట సాహిత్యం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు. కాగా, ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సిినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్యచోప్రా నిర్మిస్తోన్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, దీపికతో పాటు జాన్ అబ్రహమ్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.

Politics In YCP : వైసీపీలో విభేధాలు..మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్లు చింపేసిన సొంతపార్టీ కార్యకర్తలు