భయపెట్టే వ్యాఖ్యలు.. 100 పోస్టులను తొలగించిన ఫేస్ బుక్ , ట్విట్టర్

కోవిడ్ -19 రెండవ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాక, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఈ పరిణామంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు..

Facebook Twitter Remove 100 Posts : కోవిడ్ -19 రెండవ వేవ్ భారత ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీయడమే కాక, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్ మీడియాలో యూజర్లు ఈ పరిణామంపై ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంది. ప్రభుత్వాన్ని నిందించేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసిన 100 పోస్టులను తొలగించాలని ట్విట్టర్, పేస్ బుక్ సంస్థలను ఆదేశించింది. దీంతో ఆయా పోస్టులను తమ వేదిక నుంచి తొలగించాయి.

ఈ పోస్టులు తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించాయని ప్రభుత్వం చెబుతోంది. అదే సమయంలో ప్రజలను భయాందోనళకు గురిచేసేలా ఉన్నాయని పేర్కొంది. ప్రభుత్వం ఫిర్యాదుతో కొంతమంది ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది ట్విట్టర్.

ట్రెండింగ్ వార్తలు