Hanuman Jayanti: హనుమాన్ జయంతి.. వెల్లివిరిసిన మత సామరస్యం!

రాజస్తాన్‌లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.

Rajasthan: హనుమాన్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన ర్యాలీల్లో కొన్నిచోట్ల ఘర్షణలు జరిగితే, రాజస్తాన్‌లో మాత్రం మత సామరస్యం వెల్లివిరిసింది. రాజస్తాన్‌లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది. మసీదుల గుండా ర్యాలీ సాగుతున్నప్పుడు కొంతమంది ముస్లిం యువత ర్యాలీకి మద్దతుగా నిలిచారు. తాహిర్ అహ్మద్ నేత‌ృత్వంలోని ముస్లిం యువత ర్యాలీని స్వాగతించడమే కాకుండా, హనుమాన్ విగ్రహంపై పూలు చల్లారు. కొన్నిచోట్ల భక్తులకు మంచి నీళ్లు, షర్బత్ అందించి శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలిచారు.

Hanuman Jayanti Violence: హనుమాన్ జయంతి ర్యాలీ హింసాత్మక ఘటనలో.. 14మంది అరెస్ట్

అయితే, ఈ ప్రాంతంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా అధికార యంత్రాంగం ముందునుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంది. హిందూ, ముస్లిం సంఘాలతో సమావేశమై చర్చలు జరిపింది. శాంతియుతంగా ఉండాలని ఇరువర్గాలకు సూచించింది. అధికారుల ప్రయత్నాలు ఫలించి, ముస్లింలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కూడా ర్యాలీ శాంతియుతంగా జరిగింది.

ట్రెండింగ్ వార్తలు