indian online gamers : భారత్ లో వీడియో గేమింగ్ ఫీవర్

indian online gamers : భారత్ లో వీడియో గేమింగ్ ఫీవర్ ఎక్కువైంది.. గేమింగ్ పట్ల భారతీయుల ధోరణి క్రమంగా పెరుగుతోంది. ఓ కొత్త నివేదిక ప్రకారం, భారతీయ గేమర్స్ ప్రతి వారం సగటున ఎనిమిదిన్నర గంటలపాటు వీడియో గేమ్స్ ఆడుతున్నట్టు తేలింది, 60 శాతం కంటే ఎక్కువ మంది వరుసగా మూడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వీడియో గేమ్ ఆడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

వీడియో డెలివరీ మరియు ఎడ్జ్ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడర్ లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ తన నివేదికలో భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా గేమర్స్ ప్రతి వారం సగటున ఎనిమిది గంటల 27 నిమిషాల పాటు వీడియో గేమ్స్ ఆడుతున్నారని నివేదించింది. వినియోగదారుల ఆట సమయం గత సంవత్సరంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ అని పేర్కొంది. కరోనా లాక్ డౌన్ సమయంలో కనెక్ట్ అవ్వడానికి, అలాగే వినోదం పొందాలనే కోరిక కారణంగా ఆన్‌లైన్ గేమింగ్ కు ప్రజాదరణను పెంచిందని పేర్కొంది.

గ్లోబల్ గేమర్‌లలో సగం మంది గత సంవత్సరంలో ఆన్‌లైన్ ఆటల ద్వారా కొత్త స్నేహితులను సంపాదించుకున్నారని, ముగ్గురిలో ఒకరు ఇతర ఆటగాళ్లతో సంభాషించే సామర్థ్యం చాలా ముఖ్యమని చెప్పారు. ‘స్టేట్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ 2021’ అనే నివేదిక ప్రకారం, 2020 నుండి 2021 వరకు, భారతదేశంలో గేమింగ్ సమయం సగటున 4.1 గంటల నుండి 5.5 గంటలకు పెరిగిందని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు