Internet Suspended In Jammu: జమ్ము, రాజౌరీలో ఇంటర్నెట్ నిలిపివేత.. భారీ బందోబస్తు

 కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుండడం, జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వంటి ఘటనల నేపథ్యంలో జమ్ము, రాజౌరీలో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

Internet Suspended In Jammu: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తుండడం, జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వంటి ఘటనల నేపథ్యంలో జమ్ము, రాజౌరీలో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

అమిత్ షా 3 రోజుల పాటు జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన వైష్ణోదేవి ఆలయాన్ని కూడా సందర్శించుకున్నారు. జమ్మూకశ్మీర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, బహిరంగ సభలు, ర్యాలీల్లో ఆయన పాల్గొంటారు. పహారీలకు షెడ్యూల్ తెగ హోదా కల్పించడంపై ఆయన ప్రకటన చేసే అవకాశం ఉండడంతో గుజ్జర్లు, బకేర్వాల్‌ల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలో పోలీసులు మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రేపు రాజౌరీ, బారాముల్లాల్లో జరిగే ర్యాలీల్లో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు