Mumbai Police’s Dussehra Message: బుల్లెట్టు బండిపై తిరిగిన 10 తలల రావణుడు.. అలరిస్తున్న వీడియో

 ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో ముందుంటారు. దసరా సందర్భంగా వారు తాజాగా రూపొందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో రావణుడి వేషధారణలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతూ వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తితో హెల్మెట్ గురించి మాట్లాడడం అలరిస్తోంది. 56 క్షణాల పాటు ఈ వీడియో ఉంది. హెల్మెట్ పెట్టుకోకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారో దీని ద్వారా చూపించారు.

Mumbai Police’s Dussehra Message: ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు వినూత్న రీతిలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడంలో ముందుంటారు. దసరా సందర్భంగా వారు తాజాగా రూపొందించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో రావణుడి వేషధారణలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం నడుపుతూ వెళ్లడం, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ వ్యక్తితో హెల్మెట్ గురించి మాట్లాడడం అలరిస్తోంది. 56 క్షణాల పాటు ఈ వీడియో ఉంది.

హెల్మెట్ పెట్టుకోకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారో దీని ద్వారా చూపించారు. ‘‘జాగ్రత్తగా ఉండండి రావణుడు చూస్తున్నాడు’’ అని అందులో పేర్కొన్నారు. 10 తలల రావణుడు ఇంట్లో నుంచి చెప్పులు వేసుకుని బుల్లెట్టు బండిపై బయలుదేరుతాడు. రోడ్డుపై సిగ్నల్ వద్ద ఆపుతాడు. హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటర్ పై ఉన్న వ్యక్తితో మాట్లాడతాడు. హెల్మెట్ పెట్టుకోవాలని అతడిని రావణుడు సూచిస్తాడు.

అయితే, అందుకు అతడు ఒప్పుకోడు. దీంతో రావణుడు కోపం తెచ్చుకుని ‘‘నాకు 10 తలలు ఉన్నాయి. నీకు ఎన్ని తలలు ఉన్నాయి?’’ అని హెచ్చరిస్తాడు. రోడ్డు ప్రమాదంలో ఒక తల బద్దలైతే తనకు మరో తొమ్మిది తలలు ఉంటాయని, ఇతరులకు మాత్రం ఒక్క తలా ఉండబోదని పరోక్షంగా హెచ్చరిస్తాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు