PM Modi in Karnataka: డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఇదే…: ప్రధాని మోదీ

తమది ఓటు బ్యాంకు ప్రభుత్వం కాదని, అభివృద్ధి పనులు చేసే ప్రభుత్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు) అంటే రెట్టింపు సంక్షేమమని మోదీ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా కర్ణాటక ఎన్ని ప్రయోజనాలు పొందుతుందో ఆ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

PM Modi in Karnataka: తమది ఓటు బ్యాంకు ప్రభుత్వం కాదని, అభివృద్ధి పనులు చేసే ప్రభుత్వమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు) అంటే రెట్టింపు సంక్షేమమని మోదీ వ్యాఖ్యానించారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ద్వారా కర్ణాటక ఎన్ని ప్రయోజనాలు పొందుతుందో ఆ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పారు.

మరికొన్ని నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో మోదీ ఇవాళ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాద్గిరిలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ… గత ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించిన జిల్లాల్లో తమ సర్కారు అభివృద్ధి పనులు చేస్తోందని అన్నారు.

తాము 3.5 ఏళ్ల క్రితం జల జీవన్ మిషన్ ప్రారంభించకముందు దేశంలోని 18 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే నల్లా నీటి కనెక్షన్ ఉండేదని, ఇప్పుడు 11 కోట్ల గ్రామీణ కుటుంబాలకు అందుతోందని చెప్పారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ రూపుదిద్దుకుంటుందని, అయితే, ఇందుకు అందరి సహకారం అవసరం ఉంటుందని అన్నారు.

కర్ణాటకలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని చెప్పారు. ‘‘మిత్రులారా మీ ఆశీర్వాదాలే మా బలం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, కర్ణాటకతో పాటు మహారాష్ట్రలోనూ మోదీ ఇవాళ పర్యటించనున్నారు.

Andhra pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తిప్పలు.. రావాల్సిన బకాయిల కోసం గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సంఘాల నేతలు

ట్రెండింగ్ వార్తలు