Congress president: కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఢిల్లీలోని ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోనియా గాంధీతో పాటు ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ కూడా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే భార్య రాధాబాయి ఖర్గేను కూడా సోనియా, ప్రియాంక కలిశారు. మరోవైపు ట్విటర్ లోనూ ప్రియాంకా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఫలితాలపై స్పందించారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు శుభాకాంక్షలు’’ అని చెప్పారు. ఖర్గేకు రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా గెలుపొందిన విషయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందించారు. ‘‘చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. మల్లికార్జున ఖర్గే గెలుపొందారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుంది. ఫాసిస్టు శక్తులకు మేము కళ్లెం వేస్తాము’’ అని భూపేష్ బఘేల్ అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..