Parineeti Chopra, Raghav Chadha : పెళ్లికి ముందు పరిణితీ చోప్రా, రాఘవచద్దా స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు

ఆప్ నాయకుడు, ఎంపీ రాఘవచద్దా, బాలీవుడ్ ప్రముఖ సినీనటి పరిణితీ చోప్రాలు శనివారం అమృతసర్ నగరంలోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది మే నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది ...

Parineeti Chopra, Raghav Chadha

Parineeti Chopra, Raghav Chadha : ఆప్ నాయకుడు, ఎంపీ రాఘవచద్దా, బాలీవుడ్ ప్రముఖ సినీనటి పరిణితీ చోప్రాలు శనివారం అమృతసర్ నగరంలోని స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు చేశారు. ఈ ఏడాది మే నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది. శనివారం విమానంలో అమృత్ సర్ వచ్చిన ఈ జంట తెల్లవారుజామున చేతులు కట్టుకొని భక్తి ప్రపత్తులతో గోల్డెన్ టెంపుల్ లో నడుచుకుంటూ మీడియాకు కనిపించారు. ప్రస్తుతం వీరిద్దరూ ఈ సంవత్సరం వారి వివాహానికి సిద్ధమవుతున్నారు.

Janhvi Kapoor : మెరిసేటి గౌనులో జాన్వీ కపూర్ స్పెషల్ ఫొటోషూట్..

పరిణీతి తెల్లటి కుర్తా, సల్వార్ ధరించి తన దుపట్టాతో తల కప్పుకుంది. రాఘవ్ తెల్లటి కుర్తా-పైజామాలో బూడిద రంగు నెహ్రూ జాకెట్‌తో ఉన్నాడు. స్వర్ణ దేవాలయం లోపల నారింజ రంగు గుడ్డతో తల కప్పుకున్నాడు. రాఘవచద్దా, పరిణీతి మే 13వతేదీన న్యూఢిల్లీలోని కపుర్తలా ఇంట్లో వారి సన్నిహిత కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖ అతిథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

Team India Jersey : భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్ 11.. బీసీసీఐ ప్రకటన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పి చిదంబరం,ప్రియాంక చోప్రా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ పరిణీతి తమ ప్రేమకథ గురించి వెల్లడించింది.ఈ జంట ఇటీవలే పెళ్లి కోసం ఉదయపూర్‌లో లొకేషన్‌ల కోసం వెతికారు.

Bus tragedy survivor : బస్సులో తోటి ప్రయాణికులు సజీవంగా దహనమవుతుంటే చూసి, కిటికీ పగులగొట్టి బయపడ్డాను…

రాజస్థాన్‌లో జరిగే పెళ్లి వేడుకకు ఆమె కజిన్ ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ లు పాల్గొననున్నారు. పరిణీతి, రాఘవలు డేటింగ్ ప్రారంభించే ముందు చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు తెలుసు. పరిణీతి ఇప్పుడు చమ్కిలాలో దిల్జిత్ దోసాంజ్ సరసన నటిస్తుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ సాగుతోంది.