Prashant Kishor ‘padyatra’: నేటి నుంచి ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర.. 3,500 కి.మీటర్ల మేర..

గాంధీ జయంతి నేపథ్యంలో నేడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 3,500 కిలో మీటర్ల మేర ఉంటుంది. 'జన్‌ సురాజ్‌' ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేస్తారు. బిహార్ లోని తూర్పు చంపారన్‌ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది.

Prashant Kishor ‘padyatra’: గాంధీ జయంతి నేపథ్యంలో నేడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తన దేశ వ్యాప్త పాదయాత్రను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ యాత్ర 3,500 కిలో మీటర్ల మేర ఉంటుంది. ‘జన్‌ సురాజ్‌’ ప్రచారంలో భాగంగా ఈ యాత్ర చేస్తారు. బిహార్ లోని తూర్పు చంపారన్‌ జిల్లా నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగనుంది.

దాదాపు 18 నెలల పాటు ప్రశాంత్ కిశోర్ ఈ యాత్ర చేస్తారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నేతలను గుర్తించటం, వారిని ప్రోత్సహించడం, పలు రంగాల్లోని నిపుణుల ఆలోచనలను అమలు చేసేలా విధానాలు రూపొందించడం వంటివి ప్రశాంత్ కిశోర్ ప్రణాళికల్లో ఉంటాయి. ప్రశాంత్ కిశోర్ చాలా కాలంగా క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.

మొదట బిహార్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఆయన నేటి నుంచి ప్రారంభించనున్న పాదయాత్ర అందుకు కీలకంగా మారనుంది. ఇందులో భాగంగా ప్రశాంత్ కిశోర్ బిహార్ లోని ప్రతి పంచాయతీ, బ్లాక్‌లను సందర్శిస్తారు. పాదయాత్రలో మధ్యలో ఎలాంటి బ్రేక్‌ తీసుకోరు. కాగా, 1917లో మహాత్మా గాంధీ తొలి సత్యాగ్రహ ఉద్యమాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారు.

KCR on National Party: నేడు టీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్‌ సమావేశం

ట్రెండింగ్ వార్తలు