Viral Video: ‘మీ ఒత్తిడిని ఇలా వదిలించేసుకోండి’.. ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియో వైరల్

Viral Video

Viral Video: మీ ఒత్తిడిని ఎలా వదిలించేసుకోవాలో తెలిపే ఓ వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. దైనందిన జీవితంలో పని, ఇంట్లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి వాటితో ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. స్వల్ప స్థాయిలో ఒత్తిడి ఉంటే ఫర్వాలేదు. ఆ ఒత్తిడి అధికంగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వేలాది రోగాలకు తీవ్ర ఒత్తిడే కారణమని వైద్యులు చెబుతుంటారు.

మానసికంగా కుంగిపోతే ఏదీ సాధించలేము. అందుకే మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఈ విషయాలను ప్రయోగాత్మకంగా వివరిస్తూ ఓ ట్రైనర్ చెప్పిన అంశాలకు సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేశారు. ‘‘ఇది ఓ పాత వీడియో. అయినప్పటికీ దీన్ని చూస్తూనే ఉన్నాను. గ్లాసును కింద పెట్టండి. ప్రత్యేకించి సోమవారం ఉదయం. ఆ గ్లాసును అలాగే పట్టుకుని విధులకు వెళ్లకండి. ఒత్తిడి పెరిగేలా చూసుకోకండి’’ అన్నారు. అసలు ఆ గ్లాసు ఏంటీ? దానికీ, ఒత్తిడికీ సంబంధం ఏంటనే విషయాన్ని వీడియోలో చూడొచ్చు.

నీళ్లతో నిండిన గ్లాసును పట్టుకుని ఓ ట్రైనర్ విద్యార్థులకు చూపిస్తారు. ఆ గ్లాసును ఒక నిమిషం పాటు పట్టుకుని ఉంటే ఏమీ కాదని అంటారు. ఆ గ్లాసును ఒకవేళ గంటసేపు పట్టుకుని ఉంటే చేయి నొప్పి పెడుతుందని చెబుతారు. ఆ గ్లాసును రోజంతా పట్టుకుని ఉంటే ఒక చేయి పనిచేయని స్థితికి వెళ్తుందని అంటారు.

అలాగే, మన మెదడులో ప్రతికూల ఆలోచనలను మోస్తూ గడిపితే మనం ఏ పనీ చేయలేమని చెబుతారు. గ్లాసును కింద పెట్టేయాలని అంటారు. అంటే మనకు వచ్చే ప్రతికూల ఆలోచనలను మోస్తూ తిరగకూడదని సందేశం ఇస్తారు. వారెన్ బఫెట్ కోట్స్ వీడియోల్లో భాగంగా ఈ వీడియో ఉంది.

Hombale Films: 5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్!