MP Sadhvi Pragya: ‘ఇంట్లో ఆయుధాలు పెట్టుకోండి’ వ్యాఖ్యలపై మరోసారి బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా స్పందన

‘‘ఏదో మంచో? ఏది చెడో, ఏది చట్టబద్ధమో.. ఏది కాదో ప్రజలకు తెలుసు. దేశంలో అన్ని భావజాలాల ప్రజలు జీవిస్తున్నారు. మహిళలు, అమ్మాయిల హక్కుల గురించి నేను వారికి గుర్తు చేస్తే దీనిపై ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు’’ అని ప్రజ్ఞా చెప్పారు.

MP Sadhvi Pragya: ప్రజల హక్కులు, మహిళల భద్రతను గురించే తాను ఇటీవల గుర్తు చేస్తూ పలు వ్యాఖ్యలు చేశానని బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా అన్నారు. కొన్ని రోజుల క్రితం ప్రజ్ఞా కర్ణాటకలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ‘‘మీ కూతుళ్లు సురక్షితంగా ఉండేలా చూసుకోండి. ఇంట్లో ఆయుధాలు పెట్టుకోండి. కూరగాయలు కోసే కత్తిని పదును చేసుకోండి’’ అంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

శత్రువుల నుంచి రక్షించుకోవడానికి కత్తులు పెట్టుకోవాలని ప్రజ్ఞా చెప్పారు. దీంతో, విద్వేష వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను 103 మంది మాజీ ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేశారు. దీనిపై తాజాగా ప్రజ్ఞా స్పందించారు.

‘‘ఏదో మంచో? ఏది చెడో, ఏది చట్టబద్ధమో.. ఏది కాదో ప్రజలకు తెలుసు. దేశంలో అన్ని భావజాలాల ప్రజలు జీవిస్తున్నారు. మహిళలు, అమ్మాయిల హక్కుల గురించి నేను వారికి గుర్తు చేస్తే దీనిపై ఇబ్బంది పడే అవసరం ఏమీ లేదు’’ అని ప్రజ్ఞా చెప్పారు.

‘‘నన్ను వ్యతిరేకిస్తున్నవారు నా లోక్ సభ సభ్యత్వం పోతే చాలా సంతోషిస్తారు. ప్రజల హక్కుల గురించి నేను జాగ్రత్తలు చెప్పకపోయినా ఆనందిస్తారు. ఆత్మ గౌరవం ఉన్న మన మహిళల గురించే నేను మాట్లాడుతున్నాను. భవిష్యత్తులోనూ వారికి మద్దతుగా నిలుస్తాను. నన్ను వ్యతిరేకించే వారి గురించి నేను ఆలోచించను’’ అని ప్రజ్ఞా చెప్పారు.

Fire Broke Out : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. బంగారం షాప్ లో చెలరేగిన మంటలు

ట్రెండింగ్ వార్తలు