US condemned Harassment of Journalists : జర్నలిస్టుపై వేధింపులను ఖండించిన వైట్‌హౌస్

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన తర్వాత ఓ జర్నలిస్టుపై సాగుతున్న ఆన్‌లైన్ వేధింపులను వైట్‌హౌస్ ఖండించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రీనా సిద్ధిఖీ అనే జర్నలిస్ట్ ప్రశ్న అడిగినందుకు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు....

modi,us journlist sabrina

US condemned Harassment of Journalists : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన తర్వాత ఓ జర్నలిస్టుపై సాగుతున్న ఆన్‌లైన్ వేధింపులను వైట్‌హౌస్ ఖండించింది. మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన సబ్రీనా సిద్ధిఖీ అనే జర్నలిస్ట్ ప్రశ్న అడిగినందుకు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. భారతదేశంలోని మైనారిటీల హక్కులపై ప్రధాని మోదీకి సబ్రీనా ప్రశ్న వేశారు.

India Summons Pakistani Diplomat : పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..సిక్కులపై దాడుల ఘటనపై నిరసన

సోమవారం వైట్‌హౌస్‌లో ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా వాల్ స్ట్రీట్ జర్నల్‌కు చెందిన ఒక జర్నలిస్ట్ తన సహ ఉద్యోగి సబ్రీనా ఎదుర్కొంటున్న వేధింపులపై వైట్ హౌస్ స్పందన గురించి యూఎస్ జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ అయిన జాన్ కిర్బీని అడిగారు. దీంతో ఆ వేధింపుల నివేదికల గురించి తనకు తెలుసని, ఇలాంటివి ఆమోదయోగ్యం కాదని కిర్బీ చెప్పారు.

Lawrence Bishnoi : ఎన్ఐఏ కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సంచలన వ్యాఖ్యలు

ఎట్టి పరిస్థితుల్లోనూ జర్నలిస్టులపై సాగుతున్న వేధింపులను యునైటెడ్ స్టేట్స్ ఖచ్చితంగా ఖండిస్తున్నట్లు విలేకరుల సమావేశంలో వైట్‌హౌస్ అధికారి చెప్పారు. జర్నలిస్టులపై వేధింపులు ప్రజాస్వామ్య సూత్రాలకే విరుద్ధమని వైట్ హౌస్ అధికారి పేర్కొన్నారు. భారతదేశంలో ముస్లింలు, ఇతర మైనారిటీల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి విలేకరులు అమెరికా పర్యటనలో ఉన్న మోదీని ఈ నెల 23వతేదీన ప్రశ్నించారు. దీనిపై సమాధానం ఇచ్చిన మోదీ భారతదేశంలో ఎలాంటి వివక్షకు తావు లేదని స్పష్టం చేశారు.

wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

‘‘మనది ప్రజాస్వామ్యం…భారతదేశం, అమెరికా రెండూ దేశాల డిఎన్‌ఎలో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం స్ఫూర్తితో మనం జీవిస్తున్నాం, అది మన రాజ్యాంగంలో రాసి ఉంది, కులం,మతం ఆధారంగా వివక్షకు చోటు లేదు’’ అని మోదీ యూఎస్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు