Bulldozer Threat: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మాకి బదులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రి బత్తాయి జ్యూస్ ఎక్కించిన ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అక్కడి ఓ ఆసుపత్రిలో ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో రోగి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి పలు అంశాలను తేల్చారు.
తాజాగా, ఆ ఆసుపత్రికి అధికారులు ఓ నోటీసు పంపారు. ఆ ఆసుపత్రిని అక్రమంగా నిర్మించారని, బుల్జోడర్ తో కూల్చి వేస్తామని చెప్పారు. ఎటువంటి అనుమతులూ లేకుండా ఆసుపత్రిని నిర్మించారని, శుక్రవారంలోగా దాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ఆసుపత్రిని అధికారులు సీల్ చేశారు.
ప్రస్తుతం అందులో రోగులు లేరు. కాగా, ప్లాస్మాకు బదులుగా ప్యాకెట్ లో మోసంబి జ్యూస్ కనపడిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి రోగి ప్రాణాలు కోల్పోయాడని, ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వచ్చింది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..