Sardar Patel Divyang Cup: క్రికెట్ ఆడిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మైదానంలో క్రికెట్ ఆడి అలరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా యూపీలో యోగి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్నోలో సర్దార్ పటేల్ జాతీయ దివ్యాంగ్-టీ20 కప్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటు పట్టుకుని అలరించారు. దివ్యాంగ క్రీడాకారులు విసురుతుండగా బ్యాటింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Sardar Patel Divyang Cup: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇవాళ మైదానంలో క్రికెట్ ఆడి అలరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి సందర్భంగా యూపీలో యోగి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లక్నోలో సర్దార్ పటేల్ జాతీయ దివ్యాంగ్-టీ20 కప్ టోర్నమెంటును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాటు పట్టుకుని అలరించారు. దివ్యాంగ క్రీడాకారులు విసురుతుండగా బ్యాటింగ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గుజరాత్‌ లోని కేవడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటి వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనను గుర్తుచేసుకున్నారు. దానిపై విచారణ జరిపేందుకు కమిటీని నియమించామని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సవాళ్లను ఎదుర్కొంటూ సర్దార్ పటేల్ తన పనిని కొనసాగించిన విషయంలో అందరికీ ఆదర్శమని మోదీ అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..