Cat Viral Pic
Cat Viral Pic: కెనడాలోని ఒంటేరియో నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు వెళ్తున్న జెట్ బ్లూ విమానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఓ పిల్లి క్యాబిన్ లో తిరుగుతూ కనపడింది. ఈ విషయాన్ని గుర్తించిన విమాన సిబ్బందిలోని ఓ మహిళ ఆ పిల్లిని పట్టుకుంది. దాన్ని ప్రయాణికుల వద్దకు తీసుకువచ్చి ఈ పిల్లి ఎవరిది? అని అడిగింది.
దీంతో ప్రయాణికులు అందరూ నవ్వుకున్నారు. చివరకు ఈ పిల్లి తన యజమాని చెంతకు చేరింది. గ్రే-వైట్ కలర్ లో ఉన్న ఆ పిల్లిని విమాన సిబ్బంది పట్టుకువచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో విమానంలో ఉన్నవారు జీవితాంతం దీన్ని మర్చిపోలేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తాను ఆ సమయంలో విమానంలో ఉన్నానని, విమాన సిబ్బంది ఆ పిల్లిని పట్టుకువచ్చి అది ఎవరిదని అడిగినప్పుడు మేల్కొన్నానని ఓ ప్రయాణికురాలు చెప్పారు. ఆమె చేసిన ట్వీట్ ను 15 మిలియన్ల మంది చూశారంటే ఈ పిల్లి ఫొటో ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా వైరల్ అవుతుందో చెప్పవచ్చు.
On last night’s @JetBlue flight, ONT-JFK: “Is anyone missing a CAT. A grey-and-white CAT.” Yes I woke up for this. pic.twitter.com/XE5ywPM9x7
— Yi Shun Lai (賴儀遜) (@gooddirt) March 17, 2023
Crocodiles: బాబోయ్.. వరి పొలంలో భారీ మొసలి.. రైతులు ఏం చేశారంటే..