China’s PLA: సైనిక శ‌క్తిని మ‌రింత పెంచుకునేందుకు చైనా కీల‌క నిర్ణ‌యాలు?

సైనిక శ‌క్తిని మ‌రింత పెంచుకునేందుకు చైనా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఆయుధ సంప‌త్తిని భారీగా స‌మ‌కూర్చుకుంటున్న చైనాకు సంబంధించి సింగ‌పూర్ పోస్ట్ ఓ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టింది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో అత్యాధునిక సాంకేతిక‌త‌తో కూడిన మాన‌వ ర‌హిత ఆయుధాలు, కృత్రిమ మేధ (ఏఐ)ను త‌మ ఆర్మీకి అందించ‌నున్న‌ట్లు చైనా అధ్య‌క్షుడు షీ జిన్ పింగ్ క‌మ్యూనిస్ట్ పార్టీ స‌మావేశాల్లో తెలిపార‌ని చెప్పింది.

10 points about Xi Jinping and china politics

China’s PLA: సైనిక శ‌క్తిని మ‌రింత పెంచుకునేందుకు చైనా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇప్ప‌టికే ఆయుధ సంప‌త్తిని భారీగా స‌మ‌కూర్చుకుంటున్న చైనాకు సంబంధించి సింగ‌పూర్ పోస్ట్ ఓ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టింది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో అత్యాధునిక సాంకేతిక‌త‌తో కూడిన మాన‌వ ర‌హిత ఆయుధాలు, కృత్రిమ మేధ (ఏఐ)ను త‌మ ఆర్మీకి అందించ‌నున్న‌ట్లు చైనా అధ్య‌క్షుడు షీ జిన్ పింగ్ క‌మ్యూనిస్ట్ పార్టీ స‌మావేశాల్లో తెలిపార‌ని చెప్పింది.

2027లోగా ఈ మిల‌ట‌రీ ఆధునికీకరణ సాధించాల‌ని చైనా ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని పేర్కొంది. ప్ర‌పంచ స్థాయిలో మిల‌ట‌రీ ఆధునికీకరణ త‌మ దేశానికి అత్య‌వ‌స‌ర‌మ‌ని జిన్ పింగ్ చెప్పిన‌ట్లు సింగ‌పూర్ పోస్ట్ తెలిపింది. మెకానైజేషన్, ఇన్ఫర్మటైజేషన్, అప్లికేషన్స్ ఆఫ్ స్మార్ట్ టెక్నాలజీలను వాడుతూ పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీని స‌మ‌గ్రంగా ఆధునికీక‌రిస్తార‌ని జిన్ పింగ్ చెప్పారని పేర్కొంది.

పీఎల్ఏ కోసం సీ4ఐఎస్ఆర్ (కమాండ్, కంట్రోల్, క‌మ్యూనికేష‌న్స్, కంప్యూట‌ర్స్, ఇంట‌లిజెన్స్, నిఘా) పై దృష్టిసారిస్తామ‌ని అన్నార‌ని సింగ‌పూర్ పోస్ట్ తెలిపింది. సైబ‌ర్ స్పేస్ స‌హా అన్ని ర‌కాల‌ యుద్ధ సామ‌ర్థ్యాల‌ను పెంచుతామ‌ని అన్నార‌ని పేర్కొంది.

కాగా, 2025లో అమెరికా-చైనా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుంద‌ని అగ్ర‌రాజ్యానికి చెంద‌ని ఓ మిల‌ట‌రీ అధికారి తాజాగా వ్యాఖ్యానించిన విష‌యం తెలిసిందే. చైనా తీరుపై ప‌లు దేశాలు బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చైనా సైనిక శ‌క్తిని మ‌రింత పెంచుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

Shaakuntalam : 3 కోట్ల నగలతో, 30 కేజీల బరువుతో సమంత శాకుంతలం షూటింగ్..