కరోనా వ్యాప్తికి వాతావరణం మాత్రమే కాదు.. మనుషుల ప్రవర్తనే అసలు కారణమంట..!

  • Publish Date - November 5, 2020 / 11:21 AM IST

Weather alone virtually no effect spread of the coronavirus : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ అనేక మార్గాల్లో వ్యాపిస్తోంది. ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. కానీ, వాస్తవానికి కరోనావైరస్ వ్యాప్తిపై వాతావరణం ఒక్కటి మాత్రమే ప్రభావం చూపదు. దీనికి మనుషుల్లో వ్యక్తిగత ప్రవర్తన, జనాభా వంటి అనేక కారణాలుగా చెప్పవచ్చు.

కొత్త పరిశోధన ప్రకారం.. ఉష్ణోగ్రత, తేమ వంటివి కరోనా వ్యాప్తిలో కీలక పాత్ర పోషించవని తేలింది. అస్టిన్‌లోని యూనివర్శిటీ టెక్సాస్‌ పరిశోధకుల బృందం ఈ కొత్త అధ్యయనాన్ని నిర్వహించింది. కరోనా వ్యాప్తిలో ఉష్ణోగ్రతలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పరిశోధన సాగింది.



కరోనా మహమ్మారి వ్యాప్తి అనేది వేసవి కాలంలో చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనంలో పరిశోధక బృందం భావించింది. కానీ, అధ్యయన ఫలితాల్లో వైరస్ వ్యాప్తికి ఉష్ణోగత్ర లేదా తేమ గాని ఎలాంటి పాత్ర పోషించలేదని నిర్ధారించారు.

కరోనా వ్యాప్తి దాదాపు మనుషుల వ్యక్తిగత ప్రవర్తన, జీవన శైలి ఆధారంగానే ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. మనుషుల ప్రవర్తన, జీవనశైలి కారణంగానే కరోనా వ్యాప్తికి ఉష్ణోగ్రతలు ప్రభావితమవుతున్నాయని అధ్యయనం బృందం అంచనా వేసింది. కరోనా వ్యాప్తిలో వాతావరణం పరోక్షంగా ప్రభావితం చూపించగలదని తెలిపారు.



అన్ని వాతావరణాల్లోనూ వైరస్ :
వాతావరణ ప్రభావం తక్కువే అయినప్పటికీ మొబిలిటి వంటి కొన్ని ఇతర మార్గాల్లో వైరస్ వ్యాప్తి వాతావరణం కంటే అధిక ప్రభావం ఉంటుందని యూటీ అస్టిన్ జాక్సన్ స్కూల్ ఆఫ్ జియో సైన్సెస్ అండ్ కోక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్, టీమ్ లీడర్ దేవ్ నియోగి అన్నారు. ఉష్ణోగ్రత, తేమను కలిపి ఒకటిగా చేయగా.. గాలి ఉష్ణోగ్రత సమానంగా ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు.

అమెరికాలో 2020 మార్చి, జూలై నెలల్లో వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుందో విశ్లేషించారు. దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా సెల్ ఫోన్ డేటా ఆధారంగా హ్యుమన్ బిహేవియర్, కరోనా వ్యాప్తికి మధ్య సంబంధంపై కూడా పరిశోధక బృందం లోతుగా అధ్యయనం చేసింది.



ఇందులో వాతావరణం అంతంగా కరోనా వ్యాప్తిపై ప్రభావితం చేయలేదని గుర్తించారు. ఇతర కారణాలతో పోలిస్తే.. వాతావరణం పరోక్షంగా ప్రభావితం చేస్తుందని నిర్ధారించారు. అది కూడా 3 శాతం కంటే తక్కువగా ప్రభావితం చేస్తుందని తేలింది. హ్యుమన్ బిహేవియర్ కారణంగా ప్రత్యేకించి అధిక ప్రభావం ఉంటుందని తేల్చారు.



ఇంట్లో కంటే బహిరంగ ప్రదేశాల్లో ఉంటే కరోనా వ్యాప్తికి 34 శాతం, 26శాతంగా ఎక్కువగా అవకాశం ఉంటుందని రుజువైంది. అలాగే జనాభాతో పాటు పట్టణ సాంద్రతతో కూడా 23శాతం నుంచి 13శాతంగా ఉందని గుర్తించారు. వ్యక్తిగత జాగ్రత్తలతోపాటు పట్టణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు