పాకిస్థాన్‌ దేవాలయానికి భారీగా భారత్ యాత్రీకులు 

  • Publish Date - December 12, 2019 / 06:49 AM IST

పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కటాస్ రాజ్ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్ తెలిపింది. హిందూ యాత్రికులు శుక్రవారం (డిసెంబర్ 13) వాగా సరిహద్దు దాటి శనివారంనాటికి కటాస్ రాజ్ వద్దకు చేరుకుంటారని డిప్యూటీ సెక్రటరీ ఎవాక్యూ ప్రాపర్టీ ట్రస్ట్ బోర్డ్ (ఇటిపిబి) సయ్యద్ ఫరాజ్ అబ్బాస్ తెలిపారు. భారత్ నుంచి వచ్చే యాత్రీకుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. 

కాగా కటాస్ రాజ్ ఆలయం అనేక హిందూ దేవాలయాల సముదాయం. ఈ సముదాయం కటాస్ అనే చెరువు చుట్టూ ఉంది, దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. దీంతో భారత్ నుంచి ప్రతీ సంవత్సరం పాకిస్థాన్ కు యాత్రీకులు భారీగా తరలివెళుతుంటారు. సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు అంటే నవంబర్, డిసెంబరులో ఒకసారి లేదా  ఫిబ్రవరిలో ఒకసారి కటాస్ రాజ్ దేవాలని భారత్ లోని హిందూ యాత్రీకులు సందర్శిస్తారు.  వీరికోసం చక్వాల్ డిప్యూటీ కమిషనర్ రిటైర్డ్ కెప్టెన్ అబ్దుల్ సత్తార్ ఎసాని భారత యాత్రికుల కోసం చేసిన ఏర్పాట్లు సమీక్షించారు. 

కాగా ఉగ్రవాదులకు కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ సుందరమైన ప్రదేశాలకు నిలయం. టూరిజంపై పాక్ పెద్దగా దృష్టి పెట్టకపోవటం..దేశంలో ఉగ్రవాదం కారణంగా ఇక్కడికి టూరిస్టులు రావటానికి కూడా రావటానికి భయపడుతుంటారు. ఈ కారణంతో టూరిస్టులు తగ్గిపోతున్న  పర్యాటక ప్రదేశాలలో కటాస్ రాజ్ దేవాలయాలు కూడా ఉన్నాయి. కానీ హిందూవుల మనస్సులను దోచుకునే ఈ కటాస్ రాజ్ దేవాలన్ని సందర్శించాలనే కోరిక ఉన్నవారు మాత్రం ఈ దేవాలయాలను చూడటానికి వస్తుంటారు. ఈ క్రమంలో భారత్ నుంచి యాత్రీకులు పాక్ కు వెళ్లనున్నారు.