Time Capsule Box : 118 సంవత్సరాల ‘టైమ్ క్యాప్సూల్ బాక్స్’ ..అందులో ఏమున్నాయంటే?

'టైమ్ క్యాప్సూల్ బాక్స్' ఎప్పుడైనా చూసారా? పోనీ వాటి గురించి విన్నారా? రీసెంట్‌గా యూఎస్ ఫైర్ డిపార్ట్ మెంట్‌కి 1905 నాటి టైమ్ క్యాప్సూల్ బాక్స్ ఒకటి దొరికింది. అందులో ఏముంది? చదవండి.

US Time Capsule Box

Viral News : US ఫైర్ డిపార్ట్‌మెంట్ ఓ పాతబడిన భవనం నుంచి 118 సంవత్సరాల నాటి టైమ్ క్యాప్సూల్ బాక్స్‌ను కనుగొన్నారు. పబ్లిక్ ఈవెంట్‌లో జూన్ 1న తెరిచిన ఆ బాక్స్‌లో 1905 నాటి కొన్ని వస్తువులు బయటపడ్డాయి.

Elderly man song viral : పాత్రపై సంగీతం వాయిస్తూ పెద్దాయన పాడిన పంజాబీ పాట వినండి

US లోని ఓహియో మారియన్ నగరంలో అగ్నిమాపక సిబ్బంది ఓ పాత భవనాన్ని కూల్చడం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఓ స్తంభం తొలగించే క్రమంలో రాగి పెట్టె ఒకటి కనిపించింది. దాదాపుగా ఆ బాక్స్ అక్కడ అమర్చి 118 సంవత్సరాలు అవుతోంది. పెట్టె మొత్తం రాగితో తయారు చేయబడింది. బరువుగా ఉన్న ఆ పెట్టెలో కొన్ని వస్తువులు ఉన్నట్లు వారు గమనించారు.

 

అయితే ఆ పెట్టెను పబ్లిక్‌లోనే తెరవాలని నిర్ణయించారు. చివరకు జూన్ 1 న బాక్స్ తెరిచారు. అందులో 9 మారియర్ ఫైర్ డిపార్ట్ మెంట్ బ్యాడ్జ్‌లు.. భవనానికి సంబంధించిన కొన్ని లీజు పేపర్లు, అగ్రిమెంట్లు, 1905 లో నగరంలో ఉన్న అధికారుల జాబితా, ఆ సంవత్సరంలో లోకల్ న్యూస్ పేపర్ ‘ది మారియన్ స్టార్’ నాలుగు కాపీలు, కాల్పుల గురించి వివరించే పుస్తకం అందులో ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను అగ్నిమాపక సిబ్బంది ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

Kolkata 100 Years Tea : ఈ టీ షాప్‌కి వందేళ్ల చరిత్ర .. రాగిపాత్రలో తయారు చేసే టీ ఫుల్ ఫేమస్..

ఈ పోస్టుపై చాలామంది కామెంట్లు చేశారు. ‘చరిత్రకు సంబంధించిన ఫోటోలు చూడటం అద్భుతంగా ఉందని.. మీరు ఇలాంటి టైమ్ క్యాప్సూల్‌ని కొత్త నిర్మాణాలలో దాచాలని’ సూచించారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.