Mass Shooting: మెక్సికోలో మరోసారి రెచ్చిపోయిన దుండగులు.. విచ్చలవిడిగా కాల్పులు, 12 మంది మృతి

ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు, మెక్సికోలో రికార్డు స్థాయిలో ముఠా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. 2022లో నరహత్యలు కొంతమేర తగ్గినప్పటికీ, లోపెజ్ ఒబ్రాడోర్ ఆరేళ్ల పదవీకాలంలో చూసుకుంటే మెక్సికో ఆధునిక చరిత్రలో అత్యధిక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

12 dead as gunmen open fire at Mexico bar, second shooting in 30 days

Mass Shooting: మెక్సీకోలో ఈ మధ్య తరుచూ కాల్పులు పెరిగిపోతున్నాయి. నెల రోజులు కూడా గడవకముందే మెక్సీకోలో మరో సామూహిక కాల్పులు ఘటన వెలుగు చూసింది. తాజాగా ఇరాపువాటోలోని ఓ బార్‭లో ముష్కరులు రెచ్చిపోయి విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో 12 మంది మరణించారు. ఇందులో ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డట్టు స్థానిక అధికారులు తెలిపారు. గ్వానాజువాటో రాష్ట్రంలో నెల రోజుల వ్యవధిలో ఇలా సామూహిక కాల్పులు జరగడం ఇది రెండవసారి.

దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరాపువాటో నగర పాలక సంస్థ అధికారిక ప్రకటనలో పేర్కొంది. మెక్సికోలో హింసాత్మక ఘటనలకు ఏళ్ల తరబడి వేధింపులే కారణమని అంటున్నారు. ప్రపంచంలోని అనేక అగ్రశ్రేణి కార్ల తయారీదారులకు గ్వానాజువాటో రాష్ట్రం ఒక ప్రధాన తయారీ కేంద్రం, ఉత్పత్తి ప్రదేశం. అంతే కాకుండా ఇది ఇక్కడ మాదకద్రవ్యాల ముఠాల మధ్య జరుగుతోన్న క్రూరమైన యుద్ధాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో నగరంలో హింసాత్మక ఘటనలు మరింత పెరుగుతున్నాయి.

అక్టోబర్ 6న గెర్రెరో రాష్ట్రంలోని సిటీ హాల్‌లో ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గెర్రెరో నగర మేయర్‌తో సహా డజనుకు పైగా ప్రజలు మరణించారు. ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు, మెక్సికోలో రికార్డు స్థాయిలో ముఠా హింసను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. 2022లో నరహత్యలు కొంతమేర తగ్గినప్పటికీ, లోపెజ్ ఒబ్రాడోర్ ఆరేళ్ల పదవీకాలంలో చూసుకుంటే మెక్సికో ఆధునిక చరిత్రలో అత్యధిక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Pak PM Sharif: పాక్ డేంజరెస్ కంట్రీ అన్న బైడెన్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన పాకిస్తాన్ ప్రధానమంత్రి