Philippines Floods
Philippines Floods: ఫిలిప్పీన్స్ ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా ఆ దేశంలో కొండచరియలు విరిగిపడ్డాయి. జనవరి 1నుంచి ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నడుము లోతు నీళ్లలో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 20 మంది మరణించారు. 7వేల మందికి గాయాలయ్యాయి. వర్షాకాలం ఫిలిప్పీన్స్ లోని 13 ప్రాంతాలను ప్రభావితం చేసింది. ప్రధానంగా మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతాల్లో ప్రజలు వరదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Philippines Flood
వరద విపత్తు కారణంగా 70వేల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిని 150కిపైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి తరలించారు. సెంట్రల్ లుజోన్ ప్రాంతంలో 1,15,562 మంది, మిమరోపాలో 1,30,168 మంది, దావో ప్రాంతంలో 80,082 మంది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిలిప్పీన్స్ వ్యాప్తంగా 192 ఇళ్లు, మిమరోపా ప్రాంతంలో 112 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Philippines Flood20
అదేవిధంగా ఫిలిపిన్స్ వ్యాప్తంగా 158 రోడ్లు, 42 వంతెనలు, 24 ఓడరేవులు దెబ్బతిన్నాయి. 488 నగరాల్లో విద్యసంస్థలు మూతపడ్డాయి. 40 నగరాలు, మున్సిపాలిటీల్లో విద్యుత్ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయని జాతీయ విపత్తు రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ కౌన్సిల్ (NDRRMC) తెలిపింది.