Road Accident In China: తూర్పు చైనాలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం.. 17మంది మృతి..
తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా వాహనాలు ఢీకొని ఈ ప్రమాదంజరిగినట్లు తెలుస్తోంది.
- Harish Thanniru
- Published on- January 8, 2023 / 10:44 AM IST
Road Accident In China
Road Accident In China: తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17మంది మరణించగా, 22 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పొగమంచు కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. చైనా అధికారిక మీడియా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ రోడ్డు ప్రమాదం గురించి సమాచారాన్ని అందించింది.
Bus Accident In China: చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 27మంది మృతి.. ఈ ఏడాది అతిపెద్ద ప్రమాదం ఇదే..
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నాన్‌చాంగ్ కౌంటీలో రాత్రి 1గంట సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి సంబంధించిన సీసీ టీవీ పులేజీని కూడాపరిశీలిస్తున్నారు.
ప్రమాదం జరిగిన గంట తరువాత నాన్‌చాంగ్ కౌంటీ ట్రాఫిక్ పోలీసులు డ్రైవర్లకు ప్రయాణ సూచనలు చేశారు. పొగమంచు వాతావరణం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారుు. ఫాగ్ లైట్ల వేసి ఉంచాలని, వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని, ముందు వాహనానికి కొంచెం దూరం పాటించాలని సూచించారు. పాదాచారులు కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
