Congo : కాంగోలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి

కుంభవృష్టిగా వర్షం కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా పేర్కొన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొసాగుతున్నాయని తెలిపారు.

Congo landslides

Congo Landslides : కాంగోలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి.  భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందారు. వాయువ్య మంగల ప్రావిన్స్ లోని లిసాల్ పట్టణంలోని కాంగో నదీ తీర ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల ధాటికి కొండచరియలు విరిగి పడ్డాయి.

కొండ కింది ప్రాంతాల్లో ఉన్న ఇళ్లపై మట్టి పెళ్లలు, బండరాళ్లు పడటంతో 17 మంది మృతి చెందారు. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. కుంభవృష్టిగా వర్షం కురవడంతో భారీగా నష్టం వాటిళ్లిందని మంగల గవర్నర్ సీజర్ లింబయా మంగిసా పేర్కొన్నారు.

Uttarakhand : ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన కొండచరియలు..నలుగురి మృతి

ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొసాగుతున్నాయని తెలిపారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రావిన్స్ అంతటా మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు.