ఇరాన్ టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి.
ఇరాన్ లోని టెహ్రాన్ లో విమాన ప్రమాద ఘటనలో 170 మంది మృతి చెందారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలింది. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సాంకేతిక లోపం వల్ల విమానం కుప్పకూలింది. టెహ్రాన్ విమానాశ్రయం సమీపంలో విమానం కుప్పకూలింది. విమానం కూలినప్పుడు భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 170 మంది ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ఉన్నారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
విమానానికి నిప్పు అంటుకోవటం వల్లనే కూలిపోయిందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమానం గాల్లో ఉండగానే నిప్పు అంటున్నట్లుగా ఈ వీడియో పుటేజ్ లో ఉంది. సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్ని చేపట్టారు. విమానం టేకాఫ్ అయిన అతి కొద్ది సమయానికే రాడార్ తో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ వెంటనే విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా కూల్చేశారా అని అనుమానిస్తున్నారు.
ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న వైరం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు భావిస్తున్నారు. కావాలనే ఇరాన్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా అమెరికా భావిస్తోంది. అయిే విమాన ప్రమాదంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. అలాగే ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ రెండు మిస్సైల్స్ ను ప్రయోగించింది. ఈ దాడిని కూడా అమెరికా ఖండించింది. అయితే ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు, నివేదికను రేపు వెల్లడిస్తానని ట్రంప్ తెలిపారు. తదుపరి కార్యచరణ కూడా రేపు వెల్లడించే అవకాశం మున్నట్లు తెలుస్తోంది.