భారీ ఎన్‌కౌంటర్: 19మంది మృతి

  • Publish Date - December 2, 2019 / 04:13 AM IST

ఈశాన్య మెక్సికోలో అనుమానాస్పద మాదకద్రవ్యాల ముఠాకు భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో 19 మంది మరణించారు. ఈ విషయాన్ని కోహైవిలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  మృతుల్లో  13 మంది ముఠా సభ్యులు, ఇద్దరు సామాన్య పౌరులు, మరో నలుగురు పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొదట 14 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పగా.. నలుగురు గాయపడినట్లు తెలిపారు. అయితే మృతుల సంఖ్య 19కి పెరిగింది.

అమెరికా సరిహద్దు పట్టణం టెక్సాస్‌లోని ఈగిల్ పాస్‌కు 40 మైళ్ల దూరంలో ఉన్న విల్లా యూనియన్‌ పట్టణంలోని ఓ భవనంలోకి దుండగులు ప్రవేశించినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గంటపాటు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. ఘటనాస్థలంలో 14 ట్రక్కులు, భారీ స్థాయిలో పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శక్తివంతమైన ఆయుధాలతో ఉన్న 14 వాహనాలను అధికారులు పట్టుకున్నట్లు గవర్నర్ తెలిపారు.

క్రిమినల్ గ్రూపులు చాలా కాలంగా రాష్ట్రంలోకి ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. మెక్సికన్‌ మాదకద్రవ్యాల ముఠాలను ఉగ్రవాద సంస్థలుగా పరిగణిస్తామని ప్రకటించిన క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం.