Russia Attack On Theatre : థియేటర్‌పై రష్యా బాంబు దాడి.. 300మంది మృతి..!

యుక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరం మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై రష్యా జరిపిన దాడుల్లో 300 మంది..(Russia Attack On Theatre)

Russia Attack On Theatre : యుక్రెయిన్ పై రష్యా దాడి తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రష్యా బలగాలు బాంబుల, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌ వంటి నగరాలన్నీ ధ్వంసమవుతున్నాయి. అయినప్పటికీ రష్యా దాడులను యుక్రెయిన్ సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే మరియుపోల్‌లో ఓ థియేటర్‌పై రష్యా జరిపిన బాంబు దాడిలో 300 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. యుక్రెయిన్‌ వ్యూహాత్మక ఓడరేవు నగరమైన మరియుపోల్‌లో వందల మంది ఆశ్రయం పొందుతున్న థియేటర్‌పై గత వారంలో రష్యా జరిపిన దాడుల్లో 300 మంది మృతిచెంది ఉంటారని అధికారులు తెలిపినట్టు వార్తలు వస్తున్నాయి. మరియుపోల్‌లోని ఓ డ్రామా థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.(Russia Attack On Theatre)

Russia ukraine war : రష్యాతో పోరాటానికి రోజు 1000 ఆయుధాలు సరఫరా చేయాలని అమెరికాకు జెలెన్ స్కీ డిమాండ్

యుక్రెయిన్‌ పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌లో గత వారం థియేటర్‌పై జరిగిన బాంబు దాడి ఘటనలో దాదాపు 300 మంది మరణించి ఉండొచ్చని స్థానిక అధికారులు తాజాగా వెల్లడించారు. వెయ్యికిపైగా పౌరులు తలదాచుకుంటున్న ఈ థియేటర్‌పై రష్యా బాంబుల వర్షాన్ని ప్రపంచ దేశాలు ఖండించిన విషయం తెలిసిందే. రష్యా మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తాము దాడి చేయలేదని అంటోంది.

నెల రోజులుగా యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో లక్షలాది ప్రజలు తాగునీరు, ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. రష్యా బలగాల షెల్లింగ్‌ దాడులతో బిక్కుబిక్కుమంటున్నారు. చిన్నారులు, మహిళల పరిస్థితి దయనీయంగా మారింది.

యుక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో చిన్నారులూ బలవుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 135 మంది పిల్లలు మృతి చెందారని, 184 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం శుక్రవారం తెలిపింది. తాజాగా లుహాన్స్క్ ప్రాంతంలోని రూబిజ్నే నగరంలో జరిగిన భీకర పోరులో ఇద్దరు పిల్లలు మరణించారని చెప్పింది. డోనెట్స్క్ ప్రాంతంలోని నోవోమిఖైలివ్కాలో ఇద్దరు, జపోరిజియా ప్రాంతంలోని ఓబిల్నేలో ముగ్గురు చిన్నారులు గాయపడినట్లు తెలిపింది.

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

మే 9 నాటికి యుద్ధం ముగియనుందా..?
నెల రోజులుగా యుక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న దురాక్రమణ కారణంగా ఇరు వర్గాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఒకరినొకరు దెబ్బతీసుకునే క్రమంలో రెండు దేశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. చివరకు ఈ దాడులు ఎక్కడికి దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మే 9 నాటికి యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటున్నట్లు యుక్రెయిన్‌ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపింది. ‘మే 9 నాటికి రష్యా యుద్ధాన్ని ముగించాలనుకుంటోంది. ఈ మేరకు రష్యా దళాలకు సమాచారం ఇచ్చారు. మే 9కి ప్రత్యేకత ఉంది. జర్మనీపై నాజీ విజయం సాధించిన రోజుగా రష్యాలో వేడుక చేస్తారు’ అంటూ యుక్రెయిన్‌ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

ట్రెండింగ్ వార్తలు