నిజమే “ది డిస్‌కాంబాబ్యులేటర్” రహస్య ఆయుధాన్ని వాడాం: ట్రంప్
ఆపరేషన్ సమయంలో కారకస్ నగరంలో దాదాపు అన్ని లైట్లను ఆపేశామని ట్రంప్ ట్రంప్ మళ్లీ అన్నారు.
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారణ
- సైనిక పరికరాలను నిర్వీర్యం చేశాం
- డ్రగ్ కార్టెళ్లపై సైనిక చర్యలు కొనసాగుతాయి
Donald Trump: వెనెజువెలాపై దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసిన సమయంలో తాము “ది డిస్‌కాంబాబ్యులేటర్” అని పిలిచే రహస్య ఆయుధాన్ని వాడామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ధారించారు.
ఆ ఆయుధం వెవెజువెలా సైనిక పరికరాలను నిర్వీర్యం చేసిందని తెలిపారు. డ్రగ్ కార్టెళ్లపై సైనిక చర్యలు కొనసాగుతాయని, మెక్సికో సహా ఇతర ప్రాంతాలకూ తమ చర్యలు విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. పల్స్‌డ్ ఎనర్జీ ఆయుధంపై వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ “అది డిస్‌కాంబాబ్యులేటర్. దాని గురించి మాట్లాడేందుకు నిబంధనలు ఒప్పుకోవు” అని చెప్పారు. పల్స్‌డ్ ఎనర్జీ ఆయుధం అంటే శక్తి తరంగాల ద్వారా ఎలక్ట్రానిక్ వ్యవస్థలను నిలిపివేసే సాంకేతిక ఆయుధం.
ఆ ఆయుధం వల్ల వెవెజువెలా పరికరాలు పనిచేయలేకపోయాయని ట్రంప్ తెలిపారు. “వాళ్లు ఒక్క రాకెట్ కూడా ప్రయోగించలేకపోయారు. రష్యా, చైనా రాకెట్లు సిద్ధంగా ఉన్నా ఒక్కటి కూడా రంగంలోకి దిగలేదు. మేము వచ్చాము, వాళ్లు బటన్‌లు నొక్కారు, ఏదీ పని చేయలేదు. మాపై దాడికి సిద్ధంగా ఉన్నారు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read: పెరిగిన బంగారం ధరలు.. రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. ఎదురు తిరిగితే చంపి మరీ..
ఆపరేషన్ సమయంలో కారకస్ నగరంలో దాదాపు అన్ని లైట్లను ఆపేశామని ట్రంప్ ట్రంప్ మళ్లీ అన్నారు. అది ఎలా సాధ్యమైందో వివరించేందుకు ఆయన నిరాకరించారు. డ్రగ్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లపై అమెరికా సైనిక దాడులు కొనసాగుతాయని ట్రంప్ చెప్పారు.
శుక్రవారం తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో డ్రగ్ రవాణా చేస్తున్నట్టు అనుమానించిన ఓ నౌకపై అమెరికా దాడి చేసింది. మదురో పట్టుబడిన తర్వాత జరిగిన తొలి ఘటన అది. సెప్టెంబర్ ప్రారంభం నుంచి కరీబియన్, తూర్పు పసిఫిక్‌లో కనీసం 36 పడవలపై దాడులు జరిగాయని, వాటిలో కనీసం మంది మృతిచెందినట్టు సమాచారం.
వెనెజువెలాతో సంబంధం ఉన్న 7 చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకున్నట్టు ట్రంప్ చెప్పారు. వాటిలోని చమురును తొలగించినట్టు వెల్లడించారు. అవి ఎక్కడున్నాయో చెప్పేందుకు నిరాకరించారు.
