పెరిగిన బంగారం ధరలు.. రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. ఎదురు తిరిగితే చంపి మరీ..
అంతర్రాష్ట్ర ముఠాలు, స్థానికంగా ఉండే కేటుగాళ్లు మహిళలను లక్ష్యంగా చేసుకుని, స్నాచింగ్ చేస్తున్నారు.
chain snatching
- కలకలం రేపుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు
- మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్
- పోలీసులకూ చిక్కకుండా ఆగడాలు
Chain Snatching: తులం పసిడి ధర ఇప్పటికే రూ.1.61 లక్షలు దాటింది. దీంతో దొంగలు దీనిపై మరింత దృష్టి సారించారు. బంగారం కొట్టేస్తే చాలు లైఫ్‌ను హాయిగా ఎంజాయ్ చేసేయొచ్చని భావిస్తున్నారు. దీంతో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది.
చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు, స్థానికంగా ఉండే కేటుగాళ్లు మహిళలను లక్ష్యంగా చేసుకుని, స్నాచింగ్ చేస్తున్నారు. అతి వేగంగా బైకులను నడుపుతూ కళ్లు మూసి తెరిచేలోపు మహిళల మెడలో నుంచి చైన్‌లను కొట్టేస్తున్నారు.
Also Read: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఈసీకి కవిత దరఖాస్తు? పార్టీ పేరు ఇదే?
రోడ్లపై నచుకుంటూ వెళ్లే మహిళలే కాదు.. ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ మహిళలు ఎదురుతిరిగితే వారిని చంపేందుకు కూడా వెనుకాడడం లేదు దొంగలు.
ఒంటరి, వృద్ధ మహిళలను దొంగలు హత్య చేసి, పసిడి చోరీ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. తెలిసినవాళ్లు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం తెలంగాణలో 30కి పైగా చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి.
ఒంటరి మహిళలే లక్ష్యంగా రెక్కీ నిర్వహించి పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. ఈ కేటుగాళ్లు వాడే బైకులు కూడా వారు ఇతర ప్రాంతాల్లో చోరీ చేసి తీసుకొచ్చినవే. నంబర్ ప్లేట్లులేని బైకులతోనూ చైన్ స్నాచింగ్‌లు చేస్తున్నారు. సీసీ కెమెరాలకు చైన్ స్నాచింగ్ దృశ్యాలు చిక్కుతున్నప్పటికీ వారిని పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు.
