Plane crashes : మరో ఘోర విమాన ప్రమాదం.. పార్లమెంట్ సభ్యుడుసహా 15మంది మృతి
Plane crashes : దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్లమెంట్ సభ్యుడు సహా 15మంది మృతి చెందారు.
Plane crashes
- కొలంబియాలో కూలిన విమానం
- పార్లమెంట్ సభ్యుడు సహా 15మంది మృతి
- కొలంబియా-వెనెజులా సరిహద్దు సమీంలో జామర్ము
Plane crashes : మహారాష్ట్రలో విమానం కూలిపోయి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా మరో నలుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా.. మరో ఘోర విమాన ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పార్లమెంట్ సభ్యుడు సహా 15మంది మృతి చెందారు.
Also Read : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై మమతా బెనర్జీ అనుమానాలు
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం 13మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బందితో కలిసి కుకుటా నుంచి ఒకానాకు వాణిజ్య బీచ్‌క్రాఫ్ట్-1900 విమానం బయలుదేరింది. అయితే, ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందే కుటాటుంబోలో విమానం అదృశ్యమైంది. సెర్చ్ ఆపరేషన్ తరువాత విమాన శిథిలాలు గుర్తించారు. కొలంబియా – వెనెజులా సరిహద్దు సమీపంలో కనిపించింది.
ఈ విమాన ప్రమాదంలో పార్లమెంట్ సభ్యుడితోపాటు అందరూ చనిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కొలంబియన్ ఏరోస్పేస్ ఫోర్స్, సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు చేపట్టింది. మృతుల వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. కొలంబియా దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో విమాన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
