Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ఈ దేశాధ్యక్షులు ఇద్దరు ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం ఇస్తున్నారు. ఆ సందేశాలకు వెనుక ఉన్న అసలు విషయం ఇదే..

Russia ukraine war :పుతిన్‌ VS జెలెన్‌స్కీ..ధరించే డ్రెస్సులతోనే ప్రపంచానికి సందేశం..టీ షర్టుల వెనుక ఉన్న అసలు విషయం..

With Dresses Message To The World Putin's Puffy Coat And Zelenskyy's T Shirts Show

with dresses Message To The World: Putin’s puffy coat and Zelenskyy’s T-shirts show : మనం ధరించే దుస్తులను బట్టి మన అభిరుచులు తెలుస్తాయంటారు. శాంతికి సందేశం ‘తెలుపు’ రంగు. విప్లవానికి సంకేతం ‘ఎరుపు’ నిరసనకు సంకేతం ‘నలుపు’. ప్రకృతికి అంటే సుభిక్షానికి సంకేతం ‘ఆకుపచ్చ’.ఇలా రంగులనుబట్టి అర్థాలు మారుతుంటాయి. ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. అలాగే ఒక్కో రంగు ఒక్కో సందేశాన్ని ఇస్తుంది.అంతర్జాతీయ నాయకులు ధరించే దుస్తుల రంగుల్లో కూడా పలు అర్థాలు..పరమార్ధాలు, సందేశాలు కనిపిస్తుంటాయి. తాజాగా రష్యా-యుక్రెయిన్ యుద్ధం వేళ అటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ యుద్ధం ప్రారంభం అయినప్పటినుంచి ధరించే దుస్తుల రంగులతో ఈ నాయకులు ఇద్దరు ప్రపంచానికి ఎటువంటి సంకేతాలను ఇస్తున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. మరి పుతిన్ ధరించే దుస్తుల రంగు ఏం సందేశం ఇస్తోంది? జెలెన్ స్కీ ధరిస్తున్న రంగు ఏం సందేశం ఇస్తోంది తెలుసుకుందాం..

దేశ రక్షణ కోసమే యుక్రెయిన్ పై యుద్ధం..అంటున్నారు పుతిన్. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేయాల్సి వస్తోందంటున్నారు జెలెన్ స్కీ. కానీ ఈ యుద్ధంలో ‘నాటో’ అనే మాట కీలకంగా మారింది. ఇలా నెల రోజులుగా విరామం లేకుండా యుద్ధంలో మునిగిపోయారు ఇరు దేశాధ్యక్షులు. తనకున్న ఉన్నబలగానికి ధైర్యం ఇస్తూ ఒకరు.. బలమైన బలగాలకు అధ్యక్ష భవనం నుంచే ఆదేశాలు జారీ చేస్తూ మరొకరు మొత్తం ప్రపంచాన్ని ఆందోళనలోకి పడేశారు. ఈ యుద్ధం విషయంలో తప్పొప్పులు ఎవరివి? అనేమాట పక్కన పెడితే..యుద్ధం ప్రారంభం నుంచి ఈ ఇరు దేశాల అధ్యక్షులు ధరించే దుస్తుల రంగులు వారి ఆటిట్యూడ్‌కు నిదర్శనంగా కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. వారి ధరించే దుస్తులు ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈ ఇద్దరి పేరుల్లోను మొదటి ఉన్నది ‘వ్లాదిమిర్’ కామన్ గా ఉన్న ఇద్దరి యుద్ధం మాత్రం కొనసాగుతునే ఉంది. ఇద్దరి ఆలోచనలు భిన్నం..విభిన్నంగా ఉన్నాయి.

సాధారణ రోజుల్లో దేశాధ్యక్షుడికి వ్లాదిమిర్ జెలెన్ స్కీ సూట్‌ బూట్‌లో సందడి చేసే యుక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ.. ఈ నెలరోజుల యుద్ధంలో కనిపించిన ప్రతీసారి సాదాసీదాగా గ్రీన్‌కలర్‌ టీషర్టులో కనిపిస్తున్నారు. తద్వారా దేశంతో సమానమైన బాధను పంచుకుంటున్నాననే సందేశాన్ని పంపిస్తున్నారు జెలెన్ స్కీ. ఫ్యాషన్‌ హిస్టారియన్స్‌ అంచనా ప్రకారం.. పిరికితనానికి ఎరుపు, తెలుపు, నీలం దుస్తులను ప్రతీకగా భావిస్తారు.

జెలెన్ స్కీ డెస్సింగ్ వెనుక అర్థం ఇదే..
కానీ..జెలెన్ స్కీ మాత్రం ఒలివ్‌, గ్రీన్‌ కలర్‌ టీషర్టుల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇవి యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్న సైన్యానికి సంకేతం. కీవ్‌ నుంచి పారిపోనంటూ ఇచ్చిన ప్రకటన..ఆయనకు దేశం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తోంది.యుక్రెయిన్‌ ప్రజల తెగువ, పోరాట పటిమకు నిదర్శనం. అందుకే ప్రపంచానికి అర్థమయ్యేలా సాదాసీదా దుస్తుల్లోనే దర్శనమిస్తున్నారు జెలెన్ స్కీ. అలా తన డ్రెస్ తో తన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. పలు దేశాల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు రష్యాతో తగ్గేదేలేదంటూ.

పుతిన్‌ డ్రెస్సింగ్ వెనుక ఉన్న సందేశం ఇదే..
రష్యా మిలిటరీ చర్య మొదలైన తర్వాత.. పోయిన వారం ఓ పబ్లిక్‌ ఈవెంట్‌లో హాజరైన పుతిన్‌ ఓ ఫ్యాషనబుల్‌ కోట్‌లో దర్శనమిచ్చాడు. ఇటలీ నుంచి దిగుమతి అయిన ఆ కోట్‌ ఖరీదు సుమారు 14 వేల డాలర్లు. అంటే.. మన కరెన్సీలో అది 10 లక్షల రూపాయలకు పైనే. తద్వారా ప్రపంచానికి తన దర్శం, యుద్ధ కాంక్షను, ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని పుతిన్‌ భావించారు. కానీ యుద్ధం అంతా తన ప్లాన్ ప్రకారమే జరుగుతోంది అని ప్రకటించిన పుతిన్ ఇప్పటి వరకు యుక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోయారు. దీంతో బెడిసి కొట్టిందేమో అనే చర్చ మొదలైంది?. కానీ మరి ఈ యుద్ధ తంత్రంలో పుతిన్ ఆలోచన ఏంటో మరి..?!!

ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నేతల్లో పుతిన్‌ jpce ఒకరు. విలాసాలతో పాటు దానగుణంలోనూ ఆయనకు ఆయనే సాటి అనే పేరుంది. కర్ణుడిలా దానాలు చేస్తారనే పేరొందారు పుతిన్. కానీ..యుక్రెయిన్‌ యుద్ధ పరిణామాలు ఆ పరిస్థితుల్ని మార్చేశాయని అంటున్నారు విశ్లేషకులు.యుక్రెయిన్ పై యుద్ధం మొదలైనప్పటినుంచి రష్యా పలు విధాలుగా ఆంక్షలు ఎదుర్కొంటోంది. పైగా యుద్ధం అంటే బోలెడంత ఖర్చు. వెరసి రష్యా ఆర్థిక పతనమవుతోంది. ఈ పతనం తర్వాత..ఆ ప్రభావం రూబుల్స్‌( రష్యా కరెన్సీ)విలువ ప్రభావం చూపి దారుణంగా పతనం అయ్యింది. దీంతో అధ్యక్షుడిగా పుతిన్‌కు అందుతున్న జీతంలోనూ కోత పడింది. పైగా రష్యా సైన్యానికి ఆర్థిక తోడ్పాటు కష్టంగా అందుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ధనికదేశమనే సంకేతాలు ప్రపంచానికి పంపడం సరికాదనేది విశ్లేషకుల మాట.

ప్రధాని మోదీ (ఫైల్)

ఇక మన దేశ ప్రదాని నరేంద్ర మోదీ వేసుకునే కుర్తాకు యమ క్రేజ్ ఉంది.  ఆయన వెళ్లే సందర్భాన్ని బట్టి ఆయన కుర్తా రంగు..డిజైన్ ఉంటుంది. కుర్తాలో సింపుల్ గానే కనిపిస్తునే రిచ్ గా కూడా దర్శనమిస్తుంటారు మోడీ. ఎంతోమంది భారతీయులకు ఫ్యాషన్ ఐకాన్. ఆయన కుర్తా ధరించి, తలపాగా ధరించి నడుచుకుంటూ వస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా మోదీ ధరించే తలపాగా రంగులే తన ఫ్యాషన్‌ను ప్రతిబింబిస్తాయి. గతంలో అంతర్జాతీయ మీడియాలైతే మోడీని వేనోళ్ల పొగిడాయి. న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో ‘నాయకుడంటే ఇలాంటి దుస్తులే ధరించాలి’ అని పేర్కొంది.

Narendra Modi: కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు | జాతీయం News in Telugu

ఇందులో మోడీ ధరించే కుర్తా గురించి రాశారు. ఇండియన్ ఫ్యాషన్‌ను ప్రతిబింబించే విధంగా ఆయన వస్త్రధారణ ఉందంటూ టైమ్స్ మేగజైన్ పేర్కొంది. ఇక వాషింగ్టన్ పోస్ట్ అయితే ప్రపంచానికి కొత్త ఫ్యాషన్ ఐకాన్ వచ్చారంటూ నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించింది. కాగా, ఇప్పుడు రెండో సారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మోదీ.. ఎలాంటి దుస్తులు ధరిస్తారని సర్వత్రా చర్చించుకుంటున్నారు. 2014లో ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో మోదీ వస్త్రధారణ ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఈసారి కూడా మోదీ ప్రత్యేక దుస్తులు ధరించి ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.

పరిస్థితులకు తగ్గట్లు వస్త్రధారణ ఉండాలనేది పురాతన కాలంనుంచి వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. యూకే అధ్యక్షుడు విన్‌స్టన్ చర్చిల్ సైరన్ సూట్‌ను ధరించేవారు. వైమానిక దాడి జరిగినప్పుడు మీరు త్వరగా తప్పించుకునేందుక వీలుగా ఈ డ్రెస్ ఉంటుందట. ఇలా ఆయా దేశాల అధినేతలు ధరించే దుస్తులే వారి ఆలోచనలకు నిదర్శనంగా కనిపించే సందర్భాలు ఎన్నో ..ఎన్నెన్నో..