Earthquake: ఉత్తరకాశీలో ఉదయం 5గంటలకు భూకంపం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఫిబ్రవరి 12 శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. రిక్టర్ స్కేలుపై 4.1గా...

Utarakhand

Earthquake: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఫిబ్రవరి 12 శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అధికారిక సమాచారం ప్రకారం, తూర్పు ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతంలో ఉదయం 5గంటల 3నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ (NCS) తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లుగా ఎటువంటి వివరాలు నమోదుకాలేదు.

ఉదయం 5గంటలకు చలి కారణంగా ప్రాంతవాసులంతా ఇళ్లలోనే ఉన్నప్పటికీ ఎటువంటి ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగలేదు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో మూడోసారి మూడోసారి భూకంపం వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఆదివారం ఉదయం 11గంటల 27నిమిషాలకు 4.1 తీవ్రతో భూమి కంపించింది. అంతకుముందు ఫిబ్రవరి 5న కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది.

ఫిబ్రవరి 10న జమ్ముకశ్మీర్‌ సహా ఢిల్లీ ఎన్సీఆర్‌, ఉత్తరాఖండ్‌లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఉత్తరాఖండ్‌లోని పిథోరాఘర్‌, హిమాచల్‌లోని కిన్నౌర్‌తో సహా పలు ప్రాంతాలు భూకంపానికి గురయ్యాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌, హిమాచల్‌లలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడి.. పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఆగస్టు నెలలో సిమ్లాలో కూడా కొండచరియలు విరిగిపడ్డాయి.

Read Also : మేడారం జాతర.. ఆన్ లైన్‌‌లోనూ కానుకలు

రిక్టర్ స్కేలుపై 2.0 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాన్ని మైక్రో భూకంపం అంటారు.