Medaram Maha Jatara : మేడారం జాతర.. ఆన్ లైన్‌‌లోనూ కానుకలు

భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఆలయ ప్రాంగణం ఎక్కడి నుండైన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా అమ్మవార్ల ఖాతాలోకి తమ కానుకలను వేయొచ్చన్నారు. డిజిటల్ పేమెంట్ చేసే ముందు పేరు...

Medaram Maha Jatara : మేడారం జాతర.. ఆన్ లైన్‌‌లోనూ కానుకలు

Medaram (1)

Medaram Maha Jatara Online Transactions : మేడారం జాతరకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులు అధికంగా ఉండడంతో కానుకలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నారు. కానుకలు చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదంటోంది కెనరా బ్యాంక్. క్యూ ఆర్ కోడ్ ద్వారా భక్తులు తమ కానుకలను చెల్లించవచ్చని తెలిపింది. ఇందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ ఆన్ లైన్ పేమెంట్ లను ఉపయోగించుకోవచ్చని, ఆయా ప్రదేశాల్లో క్యూ ఆర్ కోడ్ లను ఏర్పాటు చేశామని కెనరా బ్యాంకు పేర్కొంది. తాడ్వాయి శాఖ సహకారంతో డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పించింది. ఈ విషయాన్ని కెనరా బ్యాంకు మేనేజర్ రవి కిరణ్ తెలిపారు. ఈ నెల 16న ప్రారంభం కానున్న జాతర నాలుగు రోజుల పాటు జరుగనుందనే సంగతి తెలిసిందే. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారాలమ్మ దర్శనాలకు వచ్చే భక్తులు అమ్మవార్లకు కానుకలు చెల్లించుకునేందుకు దేవాదాయ శాఖ కొత్తగా కెనరా బ్యాంక్ తాడ్వాయి శాఖ సహకారంతో డిజిటల్ పేమెంట్ సౌకర్యం కల్పించింది.

Read More : IPL 2022 Auction: రూ.562కోట్లతో 10 జట్లు, రెండ్రోజుల వేలం పూర్తి వివరాలు

కరోనా నేపథ్యం, భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో భక్తులు అమ్మవార్లకు కానుకలు సమర్పించే సమయంలో ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశ్యంతో గద్దెల ప్రాంగణం, క్యూలైన్ ప్రదేశం, అమ్మవార్ల సాలహారం, జంపన్నవాగు, ఇతర ప్రదేశాల్లో క్యూ ఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. భక్తులు తమ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే, పేటియం అమెజాన్ ఆన్ లైన్ పేమెంట్ ద్వారా మొక్కలు నేరుగా అమ్మవార్ల బ్యాంక్ ఖాతాలో నేరుగా సమర్పించుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవార్లకు చెల్లించుకునేందుకు హుండీలను గద్దెల ప్రాంగణంలో ఆరుబయట ఏర్పాటు చేయడం వల్ల అంతగా సురక్షితం కాకపోవడంతో e-హుండీలు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ సిబంది పేర్కొంటున్నారు. దేవాదాయ శాఖ వారి సహకారంతో కెనరా బాంక్ తాడ్వాయి శాఖ ఈ డిజిటల్ హుండీ క్యూ ఆర్ కోడ్ లను రూపొందించడం జరిగిందని కెనరా బాంక్ మేనేజర్ రవి కిరణ్ తెలిపారు.

Read More : Statue Of Equality : ముచ్చింతల్‌‌కు మెగాస్టార్.. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

భక్తులు సామాజిక దూరం పాటిస్తూ ఆలయ ప్రాంగణం ఎక్కడి నుండైన క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా అమ్మవార్ల ఖాతాలోకి తమ కానుకలను పంపించవచ్చన్నారు. డిజిటల్ పేమెంట్ చేసే ముందు పేరు, యూనిక్ నెంబర్ సరిచూసుకోవాలని భక్తులకు ఆయన సూచించారు. ఇప్పటివరకు సుమారుగా 30 లక్షల ట్రాంజక్షన్స్ జరిగాయన్నారు. అయితే.. సిగ్నల్ సమస్య ఉండడం వల్ల పేమెంట్ చేయాలనుకున్న భక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను ఉన్నతాధికారులు పరిష్కరిస్తే ఎక్కువ మంది భక్తులు ఉపయోగించుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్తగా క్యూ ఆర్ కోడ్లను ఏర్పాటు చేయడం చాలా బాగుందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మేడారంకు వచ్చిన భక్తులు హుండీలలో తెలిసి తెలియక బెల్లం, వడి బియ్యంతో పాటు ఇతరత్రా వేస్తుండడంతో అందులో ఉన్న డబ్బులు నాని పాడైపోయేవని పలువురు తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ సౌకర్యం ఏర్పాటు వల్ల అమ్మవార్ల ఖాతాల్లోకి నేరుగా భక్తుల కానుకలు జమకావడం బాగుందన్నారు. సిగ్నల్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.