5 Dead, Scores Trapped After 10 Storey Building Collapses In Iran
10-storey building : ఇరాన్ కుజెస్తాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అబడాన్ నగరంలో నిర్మాణంలోని 10 అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద 80 మంది వరకు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 32 మందిని వెలికితీసి ఆస్పత్రికి తరలించారు. దక్షిణ ఇరాన్‌లోని అబడాన్‌లోని ఈ భవనం ఒక్కసారిగా కూలడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.
5 Dead, Scores Trapped After 10 Storey Building Collapses In Iran
సమాచారం అందుకున్న రెస్కూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టింది. రెస్క్యూ డాగ్‌లు, హెలికాప్టర్, 7 రెస్క్యూ టీం సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా తెలిపింది. భవనంలో నివాస సముదాయాలతో పాటు బిజినెస్ సెంటర్ కోసం బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. కూలిన బిల్డింగ్ ఇరాక్ సరిహద్దుకు దగ్గరలో ఉంది.
5 Dead, Scores Trapped After 10 Storey Building Collapses In Iran
ఈ ఘటనపై కుజేస్తాన్ ప్రావిన్స్ అధికార యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఈ భవనం కాంట్రాక్టర్, యజమానిని అరెస్ట్ చేశారు. భవనం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు.. నిర్మాణంలో ఉన్న భవనం కూలడంపై అబాడాన్ నివాసితులు నగర అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Read Also : Gyanvapi Mosque : నేడు జ్ఞానవాపి మసీదు వివాదంపై కీలక తీర్పు