లేటెస్ట్ Global Survey ప్రకారం.. 22దేశాల్లో మహిళలే Online Harassmentకు ఎక్కువగా గురవుతున్నట్లుగా వెల్లడైంది. యూకేకు చెందిన హ్యుమనిటేరియన్ ఆర్గనైజేషన్ ప్లాన్ ఇంటర్నేషనల్ చేసిన సర్వే.. ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ గరల్స్ రిపోర్ట్’ లో 15నుంచి 25దేశాలకు చెందిన 14వేల మంది మహిళలు పాల్గొన్నారు.
ఇండియా, బ్రెజిల్, నైజీరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్, థాయ్‌లాండ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల వారిపై సర్వే నిర్వహించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ గర్ల్ చైల్డ్ 2020 అక్టోబరు 11కు కొద్ది రోజుల ముందే సర్వే ఫలితాలు బయటపెట్టారు. 58శాతం మంది ఆన్‌లైన్‌లో వేధింపులకు గురయ్యామని ఒపుకున్నారు.
Facebook, Instagram, Twitter, WhatsApp, TikTok లాంటి సోషల్ మీడియా వేదికగా పలుమార్లు వేధింపులకు గురయ్యారు. విశ్వవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మహిళలల్లోనే ఎక్కువ మంది దీనిని ఎదుర్కొన్నారు.
యూరప్ లో 63 శాతం మంది బాలికలు, లాటిన్ అమెరికాలో 60శాతం మంది, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 58 శాతం మంది, ఆఫ్రికాలో 54శాతం మంది, నార్త్ అమెరికాలో 52శాతం మంది వేధింపులకు గురైనట్లు రిపోర్ట్ చెప్పింది.
సెక్సువల్ వయోలెన్స్ పేరిట రేసిజం కామెంట్లు తిట్టడం, ఆన్‌లైన్ వేధింపులకు దారి తీస్తుంది. 47శాతం మంది ఫిజికల్ లేదా సెక్సువల్ వయోలెన్స్, 59శాతం మంది తిట్లు, అవమానాలు ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఉన్నాయని జరుగుతున్నాయని తెలిపింది.
సర్వే ప్రకారం.. ‘గర్ల్స్ ఓ టాక్సిక్ లెవల్ వేధింపుల వరకు మాత్రమే తట్టుకోగలుగుతున్నారు. ఆన్ లైన్ స్పేస్‌లో బాలికలను వేధించడం.. డిజిటల్ వరల్డ్ లో ఇవి రోజురోజుకూ పెరిగిపోతూ.. డ్యామేజి ఎక్కువ అవుతున్నాయి’ అని ప్లాన్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్ని బిర్గిట్టి ఆల్‌బ్రెక్టేన్ అన్నారు .