Earthquake In Papua New Guinea : పాపువా న్యూ గినియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2గా నమోదు

పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.

Earthquake In Papua New Guinea : పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. ఆదివారం న్యూ గినియాలో మారుమూల న్యూ బ్రిటన్ ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూమికి 38 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు USGS తెలిపింది.

తక్కువ జనాభా కలిగిన వెస్ట్ న్యూ బ్రిటన్ ద్వీపసమూహం ప్రాంతంలో ఆదివారం ఉదయం నమోదైంది. భూకంపం సంభవించిన ప్రాంతం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింబే పట్టణానికి సమీపంలోని వాలిండి ప్లాంటేషన్ రిసార్ట్‌లో భూ కదలికలు చోటు చేసుకున్నాయి. దీని ఎలాంటి ఇబ్బంది లేదని కార్మికుడు తెలిపారు. భూ కదలికపై ఎవరూ స్పందించలేదని.. ఎలాంటి నష్టం లేదని రిసార్ట్ వర్కర్ వెనెస్సా హ్యూస్ చెప్పారు.

Earthquake In Indonesia : ఇండోనేషియాలో భూకంపం.. 6.3 తీవ్రత నమోదు

ఇదిలా ఉండగా, ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు తూర్పు ఈశాన్యంగా 273 కి.మీ దూరంలో 4.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. భూమికి 180 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ట్వీట్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు