Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.3గా నమోదు

సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Earthquake : జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు జపాన్ మెటరాలజికల్ ఏజెన్సీ పేర్కొంది. శుక్రవారం భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

సెంట్రల్ జపాన్ లోని ఇషికావా ప్రిఫెక్చర్ లో భూ ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభవించినట్లు వెల్లడించారు. ధ్వంసమైన భవనాల నివేదికలను అధికారులు పరిశీలిస్తున్నారు.
అయితే సునామీ ముప్పు ఏమీ లేదని అధికారులు తెలిపారు.

Jammu and Kashmir Earthquake: జమ్మూ‌కాశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతగా నమోదు

కానీ, సముద్ర మట్టంలో 20 సెంటిమీటర్ల కంటే తక్కువలో మార్పులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ పేర్కొంది. కాగా, నెల రోజుల వ్యవధిలోనే జపాన్ లో భూకంపం రావిడం ఇది రెండోసారి.

ట్రెండింగ్ వార్తలు