చైనాలో భారీ పేలుడు : ఆరుగురు మృతి

  • Publish Date - March 21, 2019 / 12:16 PM IST

చైనాలో భారీ పేలుడు. యాన్ చెంగ్ లోని రసాయన పరిశ్రమలో జరిగిన యాక్సిడెంట్ లో ఆరుగురు చనిపోయారు. 30మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, స్కూళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. వందల వాహనాలు దెబ్బతిన్నాయి. 3 తీవ్రతతో భూమి కూడా కంపించింది.
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ

గురువారం(మార్చి 21,2019) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. 41 అగ్నిమాపక వాహనాల సాయంతో 188 మంది ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిశ్రమలో చిక్కుకున్న వారిలో 31 మందిని కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం ఇండస్ట్రియల్ పార్క్. కంపెనీలు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు పని చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో భారీ పేలుడు కలకలం రేపింది. కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది. 2018 నవంబర్ లో ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. కెమికల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు పేలిపోయింది. అప్పటి ఘటనలో 23మంది చనిపోయారు.

Read Also : న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం