60 రోజుల క్వారంటైన్ తర్వాత మహిళకు కరోనా పాజిటివ్

రెండు నెలలుగా క్వారంటైన్ లో ఉండి కరోనా సోకకుండా జాగ్రత్త పడిన 23ఏళ్ల ఇటలీ యువతికి వైరస్ ఉన్నట్లు నిర్దారించారు. బయాంస్ దొబ్రొయ్  అనే మహిళను అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు. సదరు మహిళ COVID-19ప్రభావానికి 105 డిగ్రీల జ్వరంతో చేరిందని వైద్యులు చెబుతున్నారు. 

హాస్పిటల్ లో చేరిన కొద్ది రోజుల వరకూ ఆమె మామూలుగానే ఉంది. కానీ, ఆమె లోపలి కరోనా లక్షణాలు ఇంకా పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. ‘మాకు తెలిసి ఇప్పటి వరకూ సుదీర్ఘ కాలం పాటు క్వారంటైన్ లో ఉండి కూడా పాజిటివ్ ఎవరికీ రాలేదు. 4వారాల క్రితం కండిషన్ ను కూడా టెస్టు ఫలితాల్లో చూడొచ్చు. మార్చి 6న ట్రీట్‌మెంట్ తీసుకుని ఇంటికి వెళ్లింది. 

57రోజుల తర్వాత వచ్చిన ఫలితాలను చూసి షాక్ అయ్యాం. ఆమె కేసు మాకు కొత్త కాదు. ఆరంభంలో ఎలా ఉందో మళ్లీ అలాగే ఉంది. ఏం మారలేదు. కాకపోతే కాస్త భయంగా ఉంది. రోగి కూడా పాజిటివ్ గానే కనిపిస్తుంది. వ్యాధి తీవ్రత పెరగడం లేదనే ధైర్యంగానే కనిపిస్తుందని డాక్టర్ అంటున్నారు. 

ఇటలీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. అందుకే మే4వరకూ లాక్ డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం. 60మిలియన్ ప్రజలను కాపాడుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడే క్రమంలో.. గత వారం చిన్న పిల్లల కోసం పూలు షాపులు, క్లాత్ స్టోర్లు రీ ఓపెన్ చేశారు.