జర్మనీలో 70శాతం మందికి కరోనా రావొచ్చు: ప్రధాని

మహమ్మారి కరోనా వైరస్‌‌ను అరికట్టే దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వాధికారులు పలు సూచనలిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంటే.. ట్రంప్ తమ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని చివాకులు పెట్టినట్లే జర్మన్ చాన్సిలర్ ఏంజిలా మార్కెల్ తమ వైద్యాధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. 

జర్మనీలో దాదాపు 60నుంచి 70శాతం మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో అన్నారు. ‘వైరస్ వ్యాప్తి చెందుతుండటాన్ని ఆరోగ్య వ్యవస్థ పట్టించుకోవడం లేదు. ఇది మనం ఆ మహమ్మారి నుంచి గెలవాల్సిన సమయం. వైరస్‌ను అడ్డుకోలేకపోయినా అది వ్యాప్తి చెందే ప్రక్రియను నెమ్మెది చేయడం కీలకం’ అని అన్నారు. 

ప్రభుత్వ ప్రస్తుత లక్ష్యం కరోనాను అదుపుచేయడమే అన్నారు. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ఇచ్చిన రిపోర్టులు ప్రకారం.. జర్మనీలో 1500కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా ముగ్గురు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్‌లో 2026కేసులు(మృతి చెందిన వారు 47మంది), ఇటలీలో 10వేల 149కేసులు(మృతి చెందిన వారు 631మంది), ఫ్రాన్స్‌లో 1784 కేసులు(మృతి చెందిన వారు 33మంది)లు ఉన్నారు. 

అయితే జర్మన్ చాన్సిలర్ ఏంజిలా మార్కెల్ కామెంట్లపై విమర్శలు తప్పలేదు. సెజ్ ప్రధాని ఆండ్రెజ్ బాబీస్.. ‘అటువంటి పరిస్థితి జర్మనీలో వస్తుందనుకోవడం లేదు. అటువంటి కామెంట్లు భయాందోళనలు సృష్టిస్తాయి. అలాంటి దారుణమైన పరిస్థితులు రావాలని ఎవరు కోరుకుంటారు’ అని ప్రశ్నించారు. 

See Also | మార్చి 31వరకూ కేరళ అంతా క్లోజ్.. ?