Brazil : 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 65 ఏళ్ల మేయర్ ..

అతనికి 65 ఏళ్లు, ఆమెకు 16 ఏళ్లు.,వారిద్దరు వివాహంచేసుకున్నారు. వివాహం తరువాత వధువు తల్లికి ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టాడు. దీనిపై వివాదాలు వచ్చినా ఐడోంట్ కేర్ అంటున్నాడీ మేయర్.

Brazilian Mayor married 16 year old girl,

Brazil : 16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 65 ఏళ్ల మేయర్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ మేయర్ ఆమె తల్లికి కీలక పదవిని కూడా కట్టబెట్టి మరింత వివాదాల్లోచిక్కారు. బ్రెజిల్ లోని అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుస్నేన్ దేహైని తనకంటే 49 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని అత్తగారికి ఉన్నత పదవి కట్టబెట్టారు.

విద్యాశాఖలో ఓ చిన్నపోస్టులో పనిచేసేవారు. కానీ తనకంటే 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకా ఆమె తల్లికి ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శిని చేశారు. ఈ విషయం బయటపడగా మేయర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా అవేమీ ఆయన పట్టించుకోవటంలేదు. పడుచుపెళ్లాం దొరికిందనే ఆనందంలో మునిగితేలుతున్నారు. కానీ 16 అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే కాకుండా ఆమె తల్లికి ఏకంగా కార్యదర్శి పదవి కట్టబెట్టారని మేయర్ పై అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు వెల్లువెత్తగా దీనిపై విచారణ సంస్థలు కన్నేశాయి. దర్యాప్తు మొదలుపెట్టాయి.

కాగా బ్రెజిల్ చట్టాల పరంగా చూస్తే 16 అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే వారి తల్లిదండ్రుల అనుమతితో చేసుకోవాలి. దీంతో అమ్మాయికి 16 ఏళ్లు దాటిన మరునాడే వివాహం చేసుకున్నారు మేయర్ దేహైని. పోనీ ఈ పెళ్లి ఆ అమ్మాయికి ఇష్టంలేకుండా జరిగిందా? అంటే అటువంటిదేమీ లేనట్లుగా అనిపిస్తోంది.ఎందుకంటే ఆ అమ్మాయి పెళ్లి సమయంలో చాలా చాలా హ్యాపీగా కనిపించింది.

ఇకపోతే అత్తగారికి సాంస్కృతిక, పర్యాటక శాఖ కార్యదర్శి పదవి కట్టబెట్టిన విషయాన్ని సిటీ సివిల్ రిజిస్ట్రీ, డిప్యూటీ మేయర్ హిల్దా లక్లాసీ సీమా ఈ విషయాన్ని బయటపెట్టటంతో పెద్ద ఎత్తున మేయర్ పై వ్యతిరేకత వచ్చింది. మేయర్ దేహైనితో కలిసి 2016,2020 ఎన్నికల్లో పోటీ చేశారు. అత్తగారికి ఉన్నతపదవి కట్టిబెట్టిన వివాదంపై మేయర్ కార్యాలయం నుంచి ప్రకటని విడుదల చేస్తు..మేయర్ కు ఉన్న అధికారాల మేరకే ఆమెకు ఈ పదవినిచ్చారని ఆమెకు ప్రజాసేవలో 26 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉందని పేర్కొన్నారు. కానీ డిప్యూటీ మేయర్ సీమా మాత్ర ఆ ప్రకటనను తోసిపుట్టారు. బంధుప్రీతితోనే మేయర్ చిన్న ఉద్యోగం చేసే ఆమెను తీసుకొచ్చి కార్యదర్శి పదవి కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు.