800 people test positive for COVID-19 on cruise ship in Australia
COVID-19: ఆస్ట్రేలియాకు చెందిన క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న 800 మందికి కొవిడ్ సోకింది. ఆ నౌకలో మొత్తంగా 4,200 మంది ప్రయాణిస్తున్నారు. క్రూయిజ్ ఆపరేటర్ కార్నివాల్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ మార్గ్యురైట్ ఫిట్జ్‌గెరాల్డ్ మాట్లాడుతూ ‘‘12 రోజుల సముద్రయానం ప్రస్తుతం సగానికి వచ్చింది. ఇంతలోనే పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే అందరికీ కొవిడ్ లక్షణాలు స్పష్టంగా కనిపించాయి. టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. అయితే ఎవరి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అంత సీరియస్ లక్షణాలు అయితే ఎవరికీ లేవు’’ అని అన్నారు.
కొవిడ్ పాజిటివ్ అని తేలినవారందరినీ ప్రస్తుతం క్వారంటైన్లో పెట్టామని, అందుకు తగ్గ ఏర్పాట్లు నౌకలోనే చేసినట్లు నౌక వైద్య బృందం పేర్కొంది. కొవిడ్ కేసుల నేపథ్యంలో నౌకలోనే కొవిడ్ ప్రొటోకాల్ అమలు చేస్తున్నట్లు మార్గ్యురైట్ ఫిట్జ్‌గెరాల్డ్ సంస్థ పేర్కొంది. రెండేళ్ల క్రితం అస్ట్రేలియాలోనే ఒక నౌకలో పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ఆ సమయంలో నౌకలోని 914 మందికి కొవిడ్ సోకగా.. అందులో 28 మంది మృతి చెందారు. మళ్లీ ఇన్నాళ్లకు ఒక నౌకలో ఇంత పెద్ద ఎత్తున కొవిడ్ కేసులు వెలుగు చూశాయి.
Himachal Pradesh Polls: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్‌లో 100% నమోదైన పోలింగ్