Himachal Pradesh Polls: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్‭లో 100% నమోదైన పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఎన్నికల బరిలో 412 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థులు.

Himachal Pradesh Polls: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్‭లో 100% నమోదైన పోలింగ్

World's highest polling booth in Himachal for 52 voters

Himachal Pradesh Polls: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ హిమాచల్ ప్రదేశ్‭లో ఉంది. తాశిగాంగ్ అనే ప్రాంతంలో ఉన్న ఈ పోలింగ్ బూత్ సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ బూత్‭లో నేడు పోలింగ్ జరిగింది. మొత్తంగా 52 మంది ఓటర్లు ఉండగా.. ఒక్కరు మిగలకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ బూతులో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. వికలాంగులు, వృద్ధులకు సౌలభ్యంగా ఉండేట్టుగా ఈ పోలింగ్ బూతులో ఏర్పాట్లు చేశారని, దీంతో అనుకున్న సమయం కంటే తొందరగానే ఓటింగ్ పూర్తైందని అధికారులు తెలిపారు.

శనివారం ఉదయమే పోలింగ్ బూతును అందంగా అలంకరించారు. చాలా ఎత్తైన ప్రదేశం కావడంతో సిబ్బంది ఒక రోజు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగాల్సి ఉండగా.. మద్యాహ్నం సమయానికే పోలింగ్ పూర్తైందని అధికారులు ప్రకటించారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5:30 వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో 68 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. ఎన్నికల బరిలో 412 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థులు.

Himachal Pradesh Polls: 412 మంది అభ్యర్థుల్లో 226 మంది కోటీశ్వరులే