Bangladesh : ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించిన మేకలు.. అవి చేసిన తప్పేంటో తెలుసా?
9 మేకలు చేసిన పొరపాటుకు ఏడాది జైల్లో ఉన్నాయి. మూగజీవాలను అంత కఠినంగా శిక్షించడానికి అంతలా అవేం తప్పు చేశాయి?
- Lakshmi 10tv
- Published On : December 10, 2023 / 05:08 PM IST
Bangladesh
Bangladesh : బంగ్లాదేశ్‌లోని బారిసల్‌లో ఏడాది క్రితం 9 మేకల్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఇటీవల వాటిని విడుదల చేసారు. అంత కఠిన శిక్ష పడటానికి ఆ మేకలు చేసిన తప్పేంటో తెలుసా? చదవండి.
తండ్రి ప్రొడ్యూసర్.. ఆగిపోయిన సినిమాకు పెట్టుబడి కోసం ఇద్దరు కొడుకులు మేకలు దొంగతనం
బారిసల్ నగరంలోని ఓ శ్మశాన వాటికిలోకి చొరబడిన 9 మేకలు గడ్డి మేసాయట. అంతే బారిసల్ సిటీ కార్పొరేషన్ వాటిని అరెస్టు చేసి జైల్లో పెట్టింది. గతేడాది డిసెంబర్ 6 న ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో వాటి యజమాని షచిబ్ రాజిబ్ ఎంత గగ్గోలు పెట్టినా విడిచిపెట్టలేదు. అప్పటి బిసిసి అడ్మినిస్ట్రేటివ్ అధికారి స్వపోన్ కుమార్ దాస్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
Goat Farm : ఏఎంజీ గోట్ ఫామ్.. ఇక్కడ విదేశీ మేకలు లభించును
ఇటీవల మేకల యజమాని షచిబ్ రాజిబ్ బిసిసి మేయర్‌కి వాటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయడంతో వాటిని డిసెంబర్ 8 న విడుదల చేసారు. మేకలను యజమానికి అప్పగించే సమయంలో ప్రస్తుత బిసిసి అడ్మినిస్ట్రేటివ్ అధికారి అలంగీర్ హుసేన్‌తో పాటు పలువురు అధికారులు ఉన్నారు. బయట స్వేచ్చగా తిరుగుతూ గడ్డి మేయాల్సిన మూగజీవాలు ఏడాది పాటు జైల్లో గడ్డి మేయడం వింతగా ఉంది.
Nine goats freed after one year in jail for eating grass in Barishal graveyard!#Bangladesh #barishal https://t.co/8vLLSSOgRf
— UNB – United News of Bangladesh (@unbnewsroom) November 24, 2023
