తండ్రి ప్రొడ్యూసర్.. ఆగిపోయిన సినిమాకు పెట్టుబడి కోసం ఇద్దరు కొడుకులు మేకలు దొంగతనం

Movie heroes: ”ఇద్దరు వ్యక్తులు మేకలు దొంగిలించి ఆ వచ్చిన డబ్బుతో సినిమాల్లో పెట్టుబడి పెట్టి లీడ్ రోల్స్ లో కనిపించాలనుకుంటారు. అనుకోని పరిస్థితుల వల్ల వాళ్లు దొరికిపోతారు” ఇదేమీ సినిమా స్క్రిప్ట్ కాదండీ యథార్థ ఘటన. సినిమాటిక్ గా ఆలోచించి దొరికిపోయిన తండ్రి కొడుకుల స్టోరీ.
తమిళనాడులోని న్యూ వాషర్‌మెన్‌పేట్‌కు చెందిన నిరంజన్ కుమార్ (30), లెనిన్ కుమార్ (32)లు ఇలా మూడు సంవత్సరాలుగా చేస్తున్నారట. శనివారం మాధవరం పోలీసులు అరెస్టు చేసిన తర్వతే విషయం వెలుగుచూసింది. సినిమా కోసం పైసా-పైసా కూడబెట్టాలనుకోలేదు. రోజుకు కనీసం 8వేల రూపాయలు సంపాదించాలనుకున్నారు. దాని కోసం 8నుంచి 10అమ్మి డబ్బు వెనకేసుకున్నారు.
ఎలా చేస్తారంటే:
చెంగళ్పేట్, మాధవరం, మింజూర్, పొన్నేరి వంటి గ్రామీణ ప్రాంతాల్లో మేకలే ఉన్న ప్రాంతాలను, అవి మేత మేయడానికి వెళ్లే చోటును పసిగడతారు. మందకు దూరంగా ఉన్న వాటిని టార్గెట్ చేసి దొంగిలించి వాహనంలో వేసుకుని పరారీ అయిపోతారు. దొరికిపోకుండా ఉండటానికి ఒకటి రెండు కాదు పది వరకూ తీసుకెళ్లిపోతారు.
ఇలా దొరికిపోయారు:
అక్టోబర్ 9న మాధవరంలోని పలానీలో ఒక మేకను దొంగిలించారు. ఆరు మేకల యజమాని ఈ విషయాన్ని వెంటనే పసిగట్టాడు. పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశాడు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజి పరిశీలించి వారిద్దరినీ పట్టుకున్నారు. అందులో తెలిసి కారులో వస్తారని, వచ్చేటప్పుడు కార్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా జాగ్రత్తపడతారని అర్థమైంది.
సినిమాటిక్‌గా పోలీసుల ప్లాన్:
దాంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. రెగ్యూలర్‌గా ఒకటి లేదా రెండు మేకలు మిస్ అయిన వారి గురించి తెలుసుకున్నారు. ప్లాన్ ప్రకారం.. సివిల్ డ్రెస్‌లలో ఉండి నిఘా మొదలుపెట్టారు. శనివారం ఆ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి నిద్రపోతున్న మేకను దొంగిలించాలని ప్రయత్నించడంతో పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు.
సినిమా ఆగకూడదని నేరాలు మొదలుపెట్టారు:
వారి తండ్రి విజయ్ శంకర్ ‘నీ థాన్ రాజా’ అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తుండగా అతని కొడుకులు అందులో లీడ్ రోల్స్ లో కనిపించాలనేది వారి ప్రయత్నం. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమా ఆగిపోవడంతో.. తండ్రికి హెల్ప్ చేయడం కోసం మేకల దొంగతనం మొదలుపెట్టారు.
స్టార్టింగ్‌లో చిన్న చిన్న అవసరాల కోసం మేకలను దొంగిలించగా ఎవరూ కంప్లైంట్ చేయలేదు. ఇదే అదనుగా చేసుకుని రెచ్చిపోయారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నారు.