Firing In Hotel : ఏలియన్స్ పై కాల్పులు జరిపా.. కానీ అవి తప్పించుకున్నాయి.. లేదంటే?
తనపై ఏలియన్స్ దాడి చేసేందుకు వస్తున్నాయంటూ ఓ వ్యక్తి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దం విని హోటల్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
- kunduru Vinod
- Published On : September 20, 2021 / 04:18 PM IST
Firing In Hotel
Firing In Hotel : గ్రహాంతరవాసులు (ఏలియన్స్) అసలు ఉన్నాయో తెలియదు. వీటిని కనుగొనేందుకు అన్వేషణ చేస్తూనే ఉన్నారు. ఇక ఇవి తమకు కనిపించాయని.. చాలామంది అనేక సార్లు చెప్పడం జరిగింది. అవి తమపై దాడి చేసేందుకు వచ్చాయని, తనకు కనిపించాయని చెబుతుంటారు. ఓ మహిళా ఏకంగా తనకు ఏలియన్స్ కిడ్నాప్ చేశారని చెప్పుకొచ్చింది. అయితే ఇవన్నీ నమ్మశక్యంగా లేవని చాలామంది కొట్టిపడేస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి తనకు ఏలియన్స్ కనిపించాయని చెబుతూ ఓ వీడియో విడుదల చేశాడు.
Read More : 11 Shocking Rules : ఇన్ని రూల్స్ పెడితే ఏ గర్ల్‌ఫ్రెండ్‌కు ఉంటుందిరా బాబూ..ఇచ్చి పడేస్తది జాగ్రత్త
ఈ వీడియో గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో మారింది. అమెరికాలోని కెంటుకీ హోటల్‌లో ఉంటున్న శామ్యూల్ రిడెల్ అనే వ్యక్తి తనకు ఏలియన్స్ కనిపించాయని తెలిపాడు. తాను ఉంటున్న రూమ్ కిటికీలో నుంచి పార్కింగ్ వైపుకు చూడగా.. అప్పుడు ఏలియన్స్ కనిపించాయని చెప్పుకొచ్చాడు.తన రూమ్ వైపు రావడం చూసి భయపడిపోయి తన వద్ద ఉన్న గన్ తో వాటిపై ఫైర్ చేశానని తెలిపాడు. ఆ తర్వాత సడన్ గా అవి కనిపించకుండా వెళ్లిపోయాయని శామ్యూల్ రిడెల్ చెప్పుకొచ్చారు.
Read More : Flora Asodia : అహ్మదాబాద్ కలెక్టర్ గా 11 ఏళ్ల బాలిక
కాల్పుల శబ్దం విన్న హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రిడెల్ జరిపిన కాల్పుల్లో ఓ బులెట్ హోటల్ లోని పక్కగదిలోకి దూసుకెళ్లింది. మరికొన్ని బులెట్లు పార్కింగ్ ప్లేస్ లో పడివున్నాయి. సిబ్బంది సమాచారంతో హోటల్ కి వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకోని విచారించారు. అతడు చెప్పిన సమాధానం విని షాక్ కి గురయ్యారు. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
