11 Shocking Rules : ఇన్ని రూల్స్ పెడితే ఏ గర్ల్‌ఫ్రెండ్‌కు ఉంటుందిరా బాబూ..ఇచ్చి పడేస్తది జాగ్రత్త

మన రిలేషన్ కొనసాగాలంటే ఈ 11 రూల్స్ పాటించాలంటూ ఓ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కు ఓ లిస్ట్ రాసి ఇచ్చాడు. ఆ రూల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ రూల్స్ ఏమిటంటే..

11 Shocking Rules : ఇన్ని రూల్స్ పెడితే ఏ గర్ల్‌ఫ్రెండ్‌కు ఉంటుందిరా బాబూ..ఇచ్చి పడేస్తది జాగ్రత్త

Usa Boyfriend Makes 11 Shocking Rules For Girlfriend

Boyfriend Makes 11 Shocking Rules for Girlfriend : ప్రేమకైనా, పెళ్లికైనా నమ్మకం చాలా ముఖ్యం. అది లేకపోతే తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అయిపోతాయి బంధాలైనా అనుబంధాలైనా. నమ్మకమనే పునాదిపైనా ఏ బంధమైనా అనుబంధమైనా కొనసాగుతుంది. అలా కాకుండా అన్నింటికి ఆంక్షలు విధిస్తే పుటుక్కున తెగిపోతాయి బంధాలు. ఇలా ఉండాలి..అలా ఉండాలి. అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఆంక్షలు పెడితే ఎవరైనా ఎంతకాలమని భరిస్తారు? ఈ విషయం ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఇదిగో ఇటువంటి బాయ్ ఫ్రెండ్ లాగా అర్థం పర్థం లేని రూల్స్ పెడితే ఎప్పుడోకప్పుడు ఒళ్లు మండి సరిపడా ఇచ్చిపడేసి పోద్ది సదరు గర్ల్ ఫ్రెండ్.. అలా సవాలక్ష రూల్స్ పెట్టిన తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓ అమ్మాయి పెట్టిన ఓ స్క్రీన్‌షాట్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ రూల్స్ గురించి తెలిసిన నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు సదరు బాయ్ ఫ్రెండ్ ని.

Read more : Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

కరోలిన్‌ అనే అమ్మాయి అమెరికా యూనివర్శిటీలో చదువుకుంటోంది. కరోలిన్‌కి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. వారిద్దరి మధ్యా రిలేషన్ బాగానే ఉంది. మరి సదరు బాయ్ ఫ్రెండ్ కు ఏమైందో తెలీదు గానీ కరోలిన్ కు రూల్స్ పెట్టాడు. నేను పెట్టిన రూల్స్ నువ్వు పాటించకపోతే మన రిలేషన్‌ కట్ట అవుతుంది? మన రిలేషన్ కొనసాగాలంటే.. ఈ 11 రూల్స్ తప్పకుండా పాటించాలని కచ్చితంగా చెప్పాడట.
తన బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన నియమాల నోట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది కరోలిన్‌. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. గర్ల్ ఫ్రెండ్ దొరటమే భాగ్యమనుకుంటే ఈ రూల్స్ ఏంటిరాబాబూ అంటూ ట్రోల్ చేస్తున్నారు. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్‌ ‘కంట్రోలింగ్’ గురించి సోషల్ మీడియాలో తెగ ట్రోల్‌ అవుతోంది.

Read more : Afghan Crisis : అఫ్ఘాన్‌లో మహిళా మంత్రిత్వశాఖ పేరు మార్చేసిన తాలిబన్లు! ఏం పెట్టారంటే

ఇంతకీ కరోలిన్‌ బాయ్‌ఫ్రెండ్‌ రూల్స్ ఏమిటంటే..కరోలిన్ తాను లేకుండా బయట తిరగకూడదు, తినకూడదు, టైట్ డ్రెస్సులు వేసుకోకూడదు, ఆమె ఆల్కహాల్‌ తాగకూడదు, తనతో తప్ప మరే అబ్బాయితోను మాట్లాడకూడదు, కలవకూడదు, తను ఇచ్చిన ఉంగరాన్ని ఆమె ఎప్పటికీ తీసివేయకూడదు, కరోలిన్ రాత్రి 9 గంటలకు తన హాస్టల్ రూమ్ కు రావాలి, క్రాప్ టాప్, టైట్ డ్రెస్ ధరించడంకూడదు, తనకు చెప్పకుండాగా గానీ తనకు ఇష్టంలేని పార్టీలకు వెళ్లకూడదు ఇలా మొత్తం 11వరకు రూల్స్ రాసి కరోలిన్ కు ఫోన్ కు సెండ్ చేశాడు ఆమె బాయ్ ఫ్రెండ్. మన రిలేషన్ కొనసాగాలంటే ఈ రూల్స్ నువ్వు తప్పకుండా పాటించాలని కచ్చితంగా చెప్పాడట.

ఆ రూల్స్ లిస్ట్ చదివిన కరోలిన్ కూడా షాక్ అయ్యింది. దీంతో ఇదేందిరాబాబూ ఈ రూల్స్ గోల అనుకుంది. కరోలిన్ బాయ్‌ఫ్రెండ్ చేసిన నియమాలను రోజూ ఆమె పాటించితీరాలట. ఈ స్క్రీన్‌షాట్‌ షేర్‌ చేసిన కరోలిన్‌.ఇలాంటివాడితో నాకు రిలేషన్ వద్దు అని చెప్పబోతున్నానంటూ తెలిపింది. కరోలిన్ నిర్ణయంపై నెటిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివాడితో రిలేషన్ కొనసాగిస్తే అన్ని మూసుకుని వాడు చెప్పినట్లుగా ఆడే బొమ్మలాగా తయారవ్వటం ఖాయం అంటున్నారు. సదరు బాయ్ ఫ్రెండ్ కు గుడ్ బై చెప్పాలనుకునే కరోలిన్ నిర్ణయం బెస్ట్ అంటున్నారు నెటిజన్లు.